Uttar Pradesh : పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

కూతురు కోమల్ కనిపించకపోవడంతో ఆమె తండ్రి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.

Uttar Pradesh : పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

Uttar Pradesh

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు. పెళ్లి కోసం బలవంతం చేసిన ప్రియురాలిని వివాహం చేసుకోవాల్సిన రోజునే ప్రియుడు హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్, కోమల్ మధ్య ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధానికి దారి తీసింది.

ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని రాహుల్ ను కోమల్ బలవంతం చేశారు. దీంతో ఆమె పోరుపడలేక పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించిన రోజునే ఆమెను అంతం చేయాలని ప్లాన్ వేశాడు. మాట్లాడాలని చెప్పి కోమల్ ను రాహుల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రాహుల్ ఆమె గొంతు నొక్కి హత్య చేశాడు. అనంతరం మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి తన ఇంటికి వెళ్లిపోయాడు.

Abdullapuret Naveen Case : అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు.. సంచలన విషయాలు వెల్లడించిన నిందితుడు హరిహర కృష్ణ

కూతురు కోమల్ కనిపించకపోవడంతో ఆమె తండ్రి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. రాహుల్, కోమల్ చివరిసారి అటవీ ప్రాంతంలో కలుసుకున్నట్లు వారి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా తెలుసుకున్నారు. దీంతో పోలీసులు రాహుల్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.

అయితే తమ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని రాహుల్ తెలిపాడు. మరోవైపు పెళ్లి కోసం తీవ్ర ఒత్తిడి చేయడంతోనే కోమల్ ను హత్య చేసినట్లు రాహుల్ ఒప్పుకున్నాడు. కోమల్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రాహుల్ ను అరెస్ట్ చేసి, అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.