బ్రేకింగ్ : శంషాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

  • Published By: chvmurthy ,Published On : February 1, 2019 / 11:45 AM IST
బ్రేకింగ్ : శంషాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

Updated On : February 1, 2019 / 11:45 AM IST

హైదరాబాద్ : శంషాబాద్‌లోని ఓ కూలర్ల తయారీ కంపెనీలో 2019, ఫిబ్రవరి 1వ తేదీ శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. నాంపల్లి ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాద ఘటన మరువక ముందే శంషాబాద్‌లోని సాతన్‌రాయిలో అగ్ని ప్రమాదం జరగడం ఆందోళనకు గురి చేసింది. వరుస  అగ్నిప్రమాదాలతో నగరవాసులు హడలిపోతున్నారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ శివారులో సాతన్‌రాయిలో ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుని అందులో కూలర్లు తయారు చేస్తున్నారు. దీనికి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ పని చేసేవారంతా బయటకు వచ్చేయటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక సమాచారం.