మద్యం మత్తులో వరుడు.. పెళ్లికి నిరాకరించిన వధువు

  • Published By: veegamteam ,Published On : March 11, 2019 / 06:09 AM IST
మద్యం మత్తులో వరుడు.. పెళ్లికి నిరాకరించిన వధువు

Updated On : March 11, 2019 / 6:09 AM IST

వివాహ వేదికపైకి పెళ్లికొడుకు మద్యం సేవించి రావడంతో వధువు పెళ్లికి నిరాకరించిన ఘటన బిహార్‌లోని దుమారిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన బీహార్‌లోని దుమ్రి చాప్రియా గ్రామంలో జరిగింది.బబ్లూ అనే యువకుడితో రింకీ కుమారికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిశ్చయించుకున్నాయి. 

ఈ క్రమంలో శనివారం భాజాభజంత్రిల మధ్య వివాహ తంతులో పెళ్లి కుమారుడు బబ్లూ విపరీతంగా మద్యం సేవించి తూలుతూ ఉన్నాడని, ఆయన వివాహ కార్యక్రమాలను చేపట్టే స్థితిలో లేడని బంధువులు చెప్పుకొచ్చారు. దీంతో పెళ్లి కుమార్తెకు కోపం వచ్చి తనకు ఈ పెళ్లి వద్దని వేదిక నుంచి వెళ్లిపోయింది. ఇరు కుటుంబాల పెద్దలు ఎంత చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు.. రింకీ తల్లితండ్రుల నుంచి పెళ్లికుమారుడి కుటుంబం తీసుకున్న కట్నం సొమ్మును తిరిగి ఇవ్వాలంటూ గ్రామస్తులు పట్టుబట్టారు.