భర్తను ఎలా చంపాలో యూట్యూబ్‌లో చూసి స్కెచ్.. ప్రియుడితో కలిసి పని పూర్తిచేసింది.. ఆ తరువాత అసలు ట్విస్ట్.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే..

సంపత్ భార్య రమాదేవి సర్వపిండి విక్రయిస్తుండేది. ఆమె వద్ద సర్వపిండికోసం రాజయ్య తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది..

భర్తను ఎలా చంపాలో యూట్యూబ్‌లో చూసి స్కెచ్.. ప్రియుడితో కలిసి పని పూర్తిచేసింది.. ఆ తరువాత అసలు ట్విస్ట్.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే..

brutal incident in Karimnagar

Updated On : August 6, 2025 / 2:20 PM IST

Karimnagar: కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేసింది. కరీంనగర్ కిసాన్‌నగర్‌కు చెందిన ఐలవేణి సంపత్ (45) జిల్లా గ్రంథాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య రమాదేవి, కుమారుడు భరత్ ఉన్నారు. సంపత్ మద్యం మత్తులో కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతోపాటు తరచూ భార్యను కొట్టేవాడు. అయితే, గత ఎనిమిది నెలల క్రితం ఓ వ్యక్తితో రమాదేవికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంకాస్త వివాహేతర సంబంధంగా మారింది. భర్త ఇబ్బందులు తట్టుకోలేక పోయిన రమాదేవి.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.

భార్య రమాదేవి సర్వపిండి విక్రయిస్తుండేది.. ఈ క్రమంలో తరచూ ఆమె వద్ద సర్వపిండికోసం కర్రె రాజయ్య వచ్చేవాడు. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఎలాగైనా భర్త సంపత్ అడ్డు తొలగించుకోవాలని రమాదేవి భావించింది. ఎవరికీ అనుమానంరాకుండా భర్తను ఎలా హత్యచేయాలో యూట్యూబ్‌లో వెతికింది. ఎవరి చెవిలోనైనా గడ్డి మందు పోస్తే చనిపోతారని యూట్యూబ్‌లో చూసి.. అదే పద్ధతిలో హత్య చేయాలని ప్రియుడికి రమాదేవి
చెప్పింది. ఇందుకోసం వారిద్దరూ ప్లాన్ వేసుకున్నారు.

ముందుగా వేసుకున్న ప్లాన్‌లో భాగంగా ప్రియుడు రాజయ్య తన స్నేహితుడైన శ్రీనివాస్‌తో కలిసి పార్టీ చేసుకుందామని సంపత్‌ను తీసుకెళ్లాడు. బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద సంపత్‌తో కలిసి వారు మద్యం సేవించారు. సంపత్ మద్యం మత్తులోకి జారుకున్నాక అతని చెవిలో రాజయ్య గడ్డి మందు పోశాడు. సంపత్ చనిపోగానే రమాదేవికి ఫోన్‌చేశాడు. మరుసటి రోజు భర్త కనిపించడంలేదని కొడుకు భరత్, రాజయ్యతో కలిసి రమాదేవి వెతుకులాడింది. ఈనెల 2వ తేదీన మృతదేహం దొరికిందని వాళ్లే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

భరత్ తన తండ్రి మృతిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలో భార్య రమాదేవిపై అనుమానం వచ్చింది. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకొని
కాల్ డేటా పరిశీలించారు. ఆ తరువాత ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో తామే హత్య చేశామని రమాదేవి ఒప్పుకుంది. దీంతో రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ల ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.