కోల్ కతాలో నోట్ల వర్షం

కోల్ కతాలో ఓ బిల్డింగ్ నుంచి నోట్ల వర్షం కురవడం కలకలం సృష్టించింది. ఓ భవనంలోని అంతస్తు నుంచి నోట్ల కట్టలను విసిరేస్తున్న దృశ్యాలను వీడియో చిత్రీకరించారు. ఈ ఘటన నగరంలోని బెంటిక్ స్ట్రీట్‌లో చోటు చేసుకుంది. బిల్డింగ్‌లోని ఆరో అంతస్తులో హోక్యూ మర్కన్ టైల్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఉంది.
Read More : ఇదొక రికార్డు : రైల్వే మొత్తం వైఫై
2019, 21వ తేదీ బుధవారం డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో సంస్థలో ఉన్న కొందరు రూ. 2 వేలు, రూ. 500, వంద నోట్ల కట్టలను బయటకు విసిరేశారు. దీనిని కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. కిందపడిన నోట్లను పలువురు సేకరిస్తున్న దృశ్యాలు అందులో కనిపించాయి. ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#WATCH Bundles of currency notes were thrown from a building at Bentinck Street in Kolkata during a search at office of Hoque Merchantile Pvt Ltd by DRI officials earlier today. pic.twitter.com/m5PLEqzVwS
— ANI (@ANI) November 20, 2019