Viral Video: కేరళలో ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టి, ఆర్చ్‭ను పడగొట్టిన బస్సు

నిజానికి రోడ్డు ఖాళీగానే ఉంది. ఒకవైపు నుంచి ఆర్టీసీ బస్సు వేగంగా వస్తోంది. వస్త ఒక కారును ఓవర్ టేక్ చేసింది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. కారు అటు పక్కకు పడిపోగా, బస్సు మాత్రం ఇటు వైపు ఉన్న చర్చి ఆర్చ్‭ని ఢీకొట్టింది. ఆ వెంటనే ఆర్చ్ ముక్కలుగా విరిగి బస్సు మీద పడింది. ఈ ఘటన మొత్తం రోడ్డు మీద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

Viral Video: కేరళలో ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టి, ఆర్చ్‭ను పడగొట్టిన బస్సు

Bus Collides With Car, Crashes Into Church Wall In Kerala

Updated On : March 11, 2023 / 5:36 PM IST

Viral Video: కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేరళ రోడ్డు ట్రాన్స్‭పోర్టుకు చెందిన ఒక బస్సు కారును ఢీ కొట్టి, అనంతరం చర్చ్ ఆర్చ్‭ను గుద్దేసింది. వెంటనే ఆ ఆర్చ్ కూలి బస్సు మీద పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి మరణం సంభవించలేదు. అయితే బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యారు. అందులో పలువురు ప్రస్తుతం ఆసుపత్రిలో కఠిన స్థితిలో చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని పటాంమిట్ట జిల్లాలోని కిజవల్లూరులో శనివారం జరిగిందీ దారుణం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వీడియో ప్రకారం.. నిజానికి రోడ్డు ఖాళీగానే ఉంది. ఒకవైపు నుంచి ఆర్టీసీ బస్సు వేగంగా వస్తోంది. వస్త ఒక కారును ఓవర్ టేక్ చేసింది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. కారు అటు పక్కకు పడిపోగా, బస్సు మాత్రం ఇటు వైపు ఉన్న చర్చి ఆర్చ్‭ని ఢీకొట్టింది. ఆ వెంటనే ఆర్చ్ ముక్కలుగా విరిగి బస్సు మీద పడింది. ఈ ఘటన మొత్తం రోడ్డు మీద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.