వార్డు మెంబర్‌గా పోటీ చేశాడని కుల బహిష్కరణ
మంచిర్యాల జిల్లాలో కులబహిష్కరణ కలకలం రేపుతోంది. వార్డు మెంబర్‌గా పోటీ చేశాడని ఓ వ్యక్తిని కుల బహిష్కరణ చేశారు.

మంచిర్యాల జిల్లాలో కులబహిష్కరణ కలకలం రేపుతోంది. వార్డు మెంబర్‌గా పోటీ చేశాడని ఓ వ్యక్తిని కుల బహిష్కరణ చేశారు.
మంచిర్యాల : నాగరిక సమాజంలో ఇంకా కుల బహిష్కరణలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో కులబహిష్కరణ కలకలం రేపుతోంది. వార్డు మెంబర్‌గా పోటీ చేశాడని ఓ వ్యక్తిని కుల బహిష్కరణ చేశారు. వివరాల్లోకి వెళితే.. హాజీపూర్ మండలం గుడిపేటలోని నేతకానిగూడెంలో పగిడి మహేందర్ 6వ వార్డు మెంబర్‌గా పోటీ చేశాడు. వద్దంటే వార్డు మెంబర్‌గా పోటీ చేశావంటూ అతనిపై నేతకాని కులస్తులు కుల బహిష్కరణ శిక్ష విధించారు. మహేందర్ ను తన కులస్తులు వెలి వేశారు. మహేందర్‌తో మాట్లాడితే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని కుల పెద్దలు హెచ్చరికలు జారీ చేశారు.