హత్రాస్ కేస్ సీబీఐ చేతికి అప్పగించిన యూపీ పోలీసులు

హత్రాస్ కేస్ సీబీఐ చేతికి అప్పగించిన యూపీ పోలీసులు

Updated On : October 11, 2020 / 8:41 AM IST

Hathras కేసును CBIకి అప్పగించారు యూపీ పోలీసులు. ఉత్తరప్రదేశ్ కు చెందిన 20ఏళ్ల దళిత యువతిని అగ్ర కులస్థులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు వెల్లువెత్తడంతో దేశవ్యాప్తంగా కల్లోలం రేపింది. ఈ విమర్శలకు సమాధానం చెప్పే దిశగా, ఆరోపణలపై నిజమైన న్యాయ విచారణ జరగాలనే కోణంలో అలహాబాద్ హైకోర్టు, యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం కేసును సీబీఐకు అప్పగించింది.

మృతురాలి అంత్యక్రియలు అర్ధరాత్రే నిర్వహించడం, అదే సమయంలో కుటుంబాన్ని ఇంట్లో బంధించడం వంటివి పెద్ద విమర్శనాత్మకంగా మారాయి. సెప్టెంబర్ 14న నలుగురు వ్యక్తులు మహిళపై దాడి చేసి చనిపోవడానికి కారణమయ్యారు. దారుణమైన గాయాలతో మహిళ రెండు వారాల పాటు పోరాడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన 2012 గ్యాంగ్ రేప్ తో పోలుస్తూ దేశ వ్యాప్త ఆందోళనలు మొదలయ్యాయి.



ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో ఆమెపై రేప్ జరగలేదంటూ యూపీ పోలీసులు క్లెయిమ్ చేశారు. వారికి ఎటువంటి సీమెన్ దొరకలేదని చెప్పారు. దాడి జరిగిన 11రోజుల తర్వాత శాంపుల్స్ తీసుకున్నారంటూ విమర్శలు వచ్చాయి.

సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నేరాన్ని కప్పి పుచ్చడానికి ప్రయత్నిస్తుందని విమర్శలు వస్తున్నాయి. అగ్ర కులమైన ఠాకూర్స్ ను సపోర్ట్ చేయాలని చూస్తుందని.. సంబంధం లేని వ్యక్తులపై కేసులు ఫైల్ చేశారని, నిందితులపై కాదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువయ్యాయి.

హత్రాస్ ఘటన తర్వాత ఉత్తరప్రదేశ్ లో మహిళల సేఫ్టీని హైలెట్ చేస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గత నెల విడుదల చేసిన డేటా ప్రకారం.. సంవత్సరంలో ప్రతి రోజూ యావరేజ్ గా 87రేప్ కేసులు జరుగుతున్నాయి. 2018తర్వాత ఇది ఏడు శాతం పెరిగింది. 2017లో 32వేల 559ఉన్న రేప్ కేసులు 2018లో 33వేల 356కు పెరిగాయి.