Loan App Case : లోన్ యాప్ కేసులో మరో ఇద్దర్ని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు
లోన్ యాప్ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. వీరి వద్ద నుంచి 63 ల్యాప్‌టాప్‌లు, 19 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Hyd Ccs Police
Loan App Case : లోన్ యాప్ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. వీరి వద్ద నుంచి 63 ల్యాప్‌టాప్‌లు, 19 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
చైనీస్ కాల్ సెంటర్‌పై దాడి చేసి షబ్బీర్ అలీం, ఉమాకాంత్ యాదవ్ అనే ఇద్దర్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బెంగళూరులో 100 మందికి పైగా ఉద్యోగులతో ఈ కాల్ సెంటర్ నడుస్తోందని, ఇప్పటి వరకూ 40 యాప్‌లు గుర్తించామనీ సీసీఎస్ జాయింట్ పోలీస్ కమిషనర్ గజరావ్ భూపాల్ తెలిపారు.
Also Read :Facebook Cheating : ఫేస్‌బుక్‌తో యువకులకు వల-నగదు దోపిడి
బెంగళూరు కేంద్రంగా ఈ కాల్ సెంటర్ ఆపరేట్ అవుతోందన్నారు. లోన్ కట్టకపోతే బంధువులకు అసభ్యంగా సందేశాలు పంపుతున్నారని…. వీరి డేటా అంతా చైనా లో ఉన్న సర్వర్ కి చేరుతుందనీ… ఛన్ చౌపింగ్ అనే చైనా దేశస్థుడి తో వాట్సాప్ సందేశాలు చేస్తున్నారని భూపాల్ తెలిపారు.
Also Read : Credit-Card Fees : క్రెడిట్ కార్డు యూజర్లకు షాకింగ్.. ఆ కార్డుల ఫీజులు పెరుగుతున్నాయి..!
ఈ సంవత్సరం ఇప్పటివరకూ లోన్ యాప్ లకు సంబంధించి 50కేసులు నమోదు అయ్యాయనీ, 221 లోన్ యాప్స్ డిలీట్ చేయాలని గూగుల్ కంపెనీ కి లేఖ రాశామని ఆయన తెలిపారు. ఈకేసులో ప్రధాన నిందితుడు ఛన్ చౌపింగ్ ప్రస్తుతం చైనా దేశం పారిపోయాడని భూపాల్ చెప్పారు.