Facebook Cheating : ఫేస్‌బుక్‌తో యువకులకు వల-నగదు దోపిడి

మగవారి బలహీనతలను ఆసరాగా చేసుకున్న కొందరు మోసగాళ్లు బరి తెగిస్తున్నారు. చిత్తూరు‌కు చెందిన మానస అనే యువతి ‘అల్లరిపిల్ల’ పేరుతో ఫేస్‌బుక్‌లో ఒక ఎకౌంట్ క్రియేట్ చేసింది. మగవారికి ఫ్రె

Facebook Cheating : ఫేస్‌బుక్‌తో యువకులకు వల-నగదు దోపిడి

Chittoor Facebook Cheating

Facebook Cheating :  టెక్నాలజీ పెరిగిపోయి అరచేతిలో ప్రపంచం ఇమిడి పోతున్న రోజుల్లో సోషల్ మీడియా పట్ల అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సప్ మొదలు పలు సోషల్ మీడియా యాప్ లలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.

ఈ క్రమంలో మగవారి బలహీనతలను ఆసరాగా చేసుకున్న కొందరు మోసగాళ్లు బరి తెగిస్తున్నారు. చిత్తూరు‌కు చెందిన మానస అనే యువతి ‘అల్లరిపిల్ల’ పేరుతో ఫేస్‌బుక్‌లో ఒక ఎకౌంట్ క్రియేట్ చేసింది. మగవారికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపడం.. ఆ తర్వాత స్నేహితులు అయ్యాక.. నగ్నంగా వీడియోకాల్స్‌ చేసి మాట్లాడుకోవడం, కొందరికి నిఘా యాప్స్‌ పంపి మొబైల్‌ స్క్రీన్‌ షేరింగ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా రూ.లక్షలు కొల్లగొట్టింది. ఈ బాగోతంలో కమీషన్‌ కోసం తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు వేయించుకుంటున్న ఎనిమిది మంది మధ్యవర్తులను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.

అల్లరిపిల్ల పేరుతో ఫేస్‌బుక్ ఖాతా తెరిచిన మానస మొదట మగవారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేది. వారు యాక్సెప్ట్ చేసి ఫ్రెండ్ అయ్యాక వారితో చాటింగ్ చేసేది. తర్వాత వారికి వాయిస్ కాల్స్ చేసి వారిని మెల్లిగా తన బుట్టలో వేసుకునేది. అనంతరం వీడియో కాల్స్ చేసి మాట్లాడుకుని నమ్మకం కలిగించేది. తరువాతి క్రమంలో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడటం చేసేది. నేరుగా కలిసేలా నమ్మకం కలిగాక ప్రమాదకరమైన స్పై యాప్స్‌ లింకులను ఆ మగవారి మొబైళ్లకు పంపేది. ఆ లింకులను ఇన్‌స్టాల్‌ చేసుకున్న తరువాత అవతలి వ్యక్తి మొబైల్‌లో ఏం చేసినా అల్లరిపిల్ల(మానస) తన సెల్‌ఫోన్‌ లో చూసేది.
Also Read : Telangana Jobs : తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు.. నిరుద్యోగులు ఫుల్ ఖుష్

మరికొందరికి క్రెడిట్‌కార్డులు ఇప్పించే పనితో స్పై యాప్స్‌ పంపేది. ఆపై ఫోన్‌పే, గూగుల్‌పే, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును మాయం చేసేది. ఈ డబ్బులను నేరుగా తన బ్యాంకు ఖాతాకు కాకుండా కొందరు వ్యక్తులను మధ్యవర్తులుగా నియమించుకుని వారి ఖాతాల్లోకి పంపించేది. చిత్తూరు నగరానికి చెందిన సీకే మౌనిక్‌ అనే వ్యక్తి అల్లరిపిల్ల మాయలోపడి ఆమె పంపిన నిఘా యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. దీంతో .. అతని బ్యాంకు ఖాతానుంచి అల్లరిపిల్ల రూ.3.64,227 రూపాయలు నాలుగు విడతలుగా దొంగిలించింది. అది నలుగురు ముఠా సభ్యుల బ్యాంకు ఖాతాలకు తరలించింది.

ఈనెల 3న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న చిత్తూరు టూటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మౌనిక్ ఖాతా నుంచి మాయమైన నగదు ఏయే ఖాతాల్లో జమయ్యిందో తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి 8 మంది నిందితులను గుర్తించిన పోలీసులు విశాఖ జిల్లాకు చెందిన ఎ.సాంబశివరావు(32), బి.ఆనంద్‌మెహతా(35), జి. శ్రీను(21), సి. కుమార్‌రాజు(21), ఎల్‌.రెడ్డి మహేష్‌ (24), జి. శివకుమార్‌ (21), వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన సి. సుధీర్‌కుమార్‌ అలియాస్‌ సుకు(30), వరంగల్‌కు చెందిన టి.శ్రావణ్‌కుమార్‌(31) అనే మధ్యవర్తులను పోలీసులు అరెస్టుచేశారు.
Also Read : Sachin Joshi : ప్రముఖ నటుడు సచిన్ జోషికి కండిషన్లతో కూడిన బెయిల్..

కాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలు ముపట్ల మానస ఎలియాస్ అల్లరి పిల్ల పరారీలో ఉంది. కాగా….ఈ ఎనిమిది మందికి కూడా ఆ అల్లరిపిల్ల ఎవరో తెలియకపోవడం కొసమెరుపు. వీరందరితో నెట్‌కాల్స్‌ ద్వారా మాట్లాడి కమీషన్‌ ఇచ్చి నగదు లావాదేవీలు జరపడానికి ఏజెంట్లుగా నియమించుకుంది. బాధితుడు మౌనిక్ ఫిర్యాదు, అరెస్టు అయిన నిందితుల వాంగ్మూలం ఆధారంగా అల్లరిపిల్లను ఓ యువతిగా గుర్తించామని ఆమెను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ సుధాకర రెడ్డి తెలిపారు.