ప్రియాంక రెడ్డి కేసు : దోషులకు న్యాయ సాయం చేయొద్దు – కిషన్ రెడ్డి

  • Published By: madhu ,Published On : November 29, 2019 / 11:12 AM IST
ప్రియాంక రెడ్డి కేసు : దోషులకు న్యాయ సాయం చేయొద్దు – కిషన్ రెడ్డి

Updated On : November 29, 2019 / 11:12 AM IST

దారుణ హత్యకు గురైన వెటర్నరీ యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. 2019, నవంబర్ 29వ తేదీ శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. దోషుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. దోషులకు న్యాయసాయం చేయొద్దని న్యాయవాదులను కోరినట్లు, వీరికి ఉరిశిక్ష పడాలన్నారు. 

మహిళపై అత్యాచారం యావత్ దేశం తీవ్ర ఆందోళన, బాధ వ్యక్తం చేస్తోందన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. పేద, మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహిళ అని తెలిపారు. కొంతమంది సహాయం చేస్తామని చెప్పి..అత్యాచారం..హత్య చేసి తగులబెట్టారనే వార్తలు వస్తున్నాయని ఇంతకంటే అమానుషమైన ఘటన ఇంకోంటి ఉండదన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షించపడేలా చూడాలని తెలంగాణ పోలీసులను కోరడం జరిగిందన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలను పూర్తిగా అరికట్టేలా అంతా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు మంత్రి కిషన్ రెడ్డి. 
Read More : ప్రియాంకరెడ్డి కేసు: KTR ట్వీట్..సబితా..కలెక్టర్ పరామర్శ