ఏం జరిగిందో చెప్పు : శ్రిఖా చౌదరిని విచారిస్తున్న తెలంగాణ పోలీసులు

  • Published By: madhu ,Published On : February 14, 2019 / 07:53 AM IST
ఏం జరిగిందో చెప్పు : శ్రిఖా చౌదరిని విచారిస్తున్న తెలంగాణ పోలీసులు

పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో విచారణ స్పీడప్ అయ్యింది. తెలంగాణ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరీ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాకేష్ రెడ్డిని విచారించిన వారు.. ఇప్పుడు శ్రిఖా చౌదరిని కూడా ప్రశ్నిస్తున్నారు. శ్రిఖా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటోంది. నాలుగు రోజులు విచారించిన ఏపీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు మళ్లీ ప్రశ్నిస్తున్నారు. శ్రిఖా చౌదరిని 2019, ఫిబ్రవరి 14వ తేదీ గురువారం ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ, బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ విచారణ సాగుతోంది. 
జయరాం మర్డర్‌కి సంబంధం లేదని శ్రిఖా వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే.. హత్యలో శ్రిఖా పాత్ర ఉందని మేనత్త, జయరాం భార్య పద్మశ్రీ పోలీసులకు కంప్లయింట్ చేసింది. అంతేకాకుండా ఆమె ప్రవర్తనపైనా అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ కోణంలోనూ తెలంగాణ పోలీసులు విచారణ చేస్తున్నారు. జయరాం భార్య పద్మశ్రీ.. పోలీసులకు ఇచ్చిన వివరాలతోపాటు మీడియాతో మాట్లాడిన అంశాలపైనా శ్రిఖాను ప్రశ్నిస్తున్నారు. కేసులోని ప్రతి కోణాన్ని మిస్ చేయకుండా.. ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రాకేష్ రెడ్డి – జయరాం పరిచయం తెలియదు అంటోంది శ్రిఖాచౌదరి. అయితే కొన్ని ఫొటోల్లో శ్రిఖా-రాకేష్ కలిసి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వీటిపైనా పోలీస్ విచారణ సాగుతుంది. 

విచారణలో రాకేష్ రెడ్డి కొత్త విషయాలు వెల్లడించినట్లు సమాచారం. జయరాం – రాకేష్ రెడ్డి మధ్య కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఇప్పటి వరకు ఉన్న సమాచారం. హత్యకు ముందు కూడా ఆప్తుల దగ్గర నుంచి లక్షల రూపాయల డబ్బు జయరాం ద్వారా.. రాకేష్ వసూలు చేసినట్లు ఏపీ పోలీసులు చెప్పారు. అయితే అలాంటిది ఏమీ లేదని తెలంగాణ పోలీస్ విచారణలో వెల్లడైనట్లు ప్రచారం జరుగుతుంది.

 

డబ్బు కోణంతోపాటు మరేదో ఉన్నట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. రాకేష్ రెడ్డి ఇంట్లో, ఆ తర్వాత జయరాం డెడ్ బాడీతో చేసిన జర్నీ మొత్తం సీన్ ను రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. సీన్ రీ కన్స్‌స్ట్రక్షన్ తర్వాత రాకేష్, శ్రీనివాస్‌లను పీఎస్‌కు తరలించారు. ఇదే ఇంట్లో జయరాం 26గంటలు ఉన్నట్లు పోలీసుల విచారణలో రాకేష్ వెల్లడించినట్లు సమాచారం. శ్రిఖాచౌదరితోపాటు మరో 10మందిని విచారిస్తున్నారు పోలీసులు.