చిగురుపాటి మృతిపై ఎన్నో అనుమానాలు

  • Published By: madhu ,Published On : February 1, 2019 / 02:57 AM IST
చిగురుపాటి మృతిపై ఎన్నో అనుమానాలు

విజయవాడ : కోస్టల్ బ్యాంకు అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఎండీ చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఈయన మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆయన్ను ఎవరైనా చంపేశారా ? లేక ఆత్మహత్య చేసుకున్నారా తెలియాల్సి ఉంది. 

హైదరాబాద్ నుండి విజయవాడకు ఈయన వెళుతున్నారు. ఫిబ్రవరి 01వ తేదీన శుక్రవారం నందిగామ మండలం ఐతవరం జాతీయ రహదారి పక్కనే కారులో ఇతని డెడ్ బాడీ లభ్యమైంది. ఇతను ఎలా చనిపోయారనే దానిపై క్లారిటీ లేదు. కానీ పక్కా హత్య అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిగురుపాటి తలపై రక్తపు మరకలుండడం,  కారు వెనుక భాగంలోని సీటు కింద డెడ్ బాడీ పడి ఉండడం…కారుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం ఇలా అనేక డౌట్స్ వ్యక్తమౌతున్నాయి. అంతేకాదు…కారులో మద్యం సీసాలు కూడా ఉన్నాయి. కారులో డ్రైవర్ ఉంటే ఎక్కడున్నాడనే సమాచారం లేదు. సూర్యాపేట, చిల్లకల్లు చెక్ పోస్టు సెంటర్లలో సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. 

ఇక చిగురుపాటి జయరామ్ విషయానికి వస్తే…ఇతను సౌమ్యంగా ఉండే వ్యక్తి..అని తెలుస్తోంది. ఎక్స్‌ప్రెస్ టీవీ ఛానెల్ నడిపే సమయంలో పార్ట్‌నర్‌తో విబేధాలున్నాయా ? లేక ఇతర వ్యాపారాల్లో అనేది తెలియాల్సి ఉంది. కోస్టల్ బ్యాంకు అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఎండీగా సుపరిచితుడు. గుంటూరు జిల్లా తెనాలీలో ఈయన జన్మించారు. ఇతను అమెరికన్ పౌరుడు. ఫ్లోరిడాలో ఆయన భార్య..పిల్లలు నివాసం ఉంటున్నారు. అక్కడ ఓ బ్యాంకులో భాగస్వామి అని తెలుస్తోంది. సామాన్య కుటుంబంలో జన్మించిన చిగురుపాటి అతి కొద్దికాలంలో పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. అనేక కంపెనీలను స్థాపించి వ్యాపారరంగంలో రాణించారు.