Classmate Slashes Girl’s Neck :తనతో రొమాన్స్ చేయలేదని గొంతుకోసి చంపాడు
కాలేజీలో తన తోటి విద్యార్దినిని ప్రేమ పేరుతో, లైంగికంగా వేధిస్తూ తనతో రొమాన్స్ చేయమని కోరుతున్నాడొక విద్యార్ధి.

Kottayam College Murder
Classmate Slashes Girl’s Neck : కాలేజీలో తన తోటి విద్యార్దినిని ప్రేమ పేరుతో, లైంగికంగా వేధిస్తూ తనతో రొమాన్స్ చేయమని కోరుతున్నాడొక విద్యార్ధి. అందుకు ఆమె నిరాకరించటంతో పరీక్ష రాయటానికి వచ్చిన విద్యార్ధినిని కిరాతకంగా హత్యచేశాడు. కేరళలోని కొట్టాయం జిల్లా పాలా ఏరియాలోని సెయింట్ థామస్ కాలేజీలో శుక్రవారం ఉదయం ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.
కొట్టాయం జిల్లాలోని వైకోమ్ లోని తొలయోల పరంబుకు చెందిన నితినా మోల్(22) సెయింట్ థామస్ కాలేజీలో చదువుతోంది. అదే కాలేజీలో కొట్టాయంజిల్లా, వల్లచిరకు చెందిన అభిషేక్(22) కూడా చదువుతున్నాడు. ఈక్రమంలో అభిషేక్, నితినా వెంటపడి వేధించటం మొదలెట్టాడు. తనతో ఫ్రెండ్ షిప్ చేయాలని.. తనతో రొమాన్స్ చేయాలని వేధించసాగాడు. అయితే అభిషేక్ ప్రతిపాదనలను నితినా తిరస్కరించింది.
అతడి మాటలను పట్టించుకోకుండా తనదారిన తాను కాలేజీకి వచ్చి వెళుతోంది. దీంతో అభిషేక్ నితినాపై కోపం పెంచుకున్నాడు. రాన్రాను అది పగలాగా మారింది. నితినాపై పగ పెంచుకున్న అభిషేక్ ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో శుక్రవారం కాలేజీలో పరీక్షలు రాసేందుకు ఇద్దరూ వచ్చారు. శుక్రవారం ఉదయం పరీక్షలు ప్రారంభమయ్యాయి.
Also Read : Attck On Police Station : పోలీసు స్టేషన్‌పై దాడి 53 మంది అరెస్ట్
పగతో రగిలిపోతున్న అభిషేక్ పరీక్ష పూర్తిగా రాయకుండా మధ్యలోనే బయటకు వచ్చేశాడు. క్యాంపస్‌లోనే నితినా ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూడసాగాడు. పరీక్ష రాసి బయటకు వచ్చిన నితినా పై పేపర్ కట్టర్ సాయంతో గొంతుకోసాడు. తీవ్ర రక్త స్రావమైన నితినాను కాలేజీ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే నితినా ప్రాణాలు విడిచింది.
కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసుసులు కేసు నమోదు చేసుకుని అభిషేక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.కాగా… నితినాను గొంతుకోసిన తర్వాత అభిషేక్ అక్కడే కూర్చుండి పోయాడు. వీరిద్దరూ గొడవపడుతున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది ఒకరు చూశామని తెలిపారు. తాను నితినాను హత్యచేయాలని అనుకోలేదని అరెస్టైన తర్వాత అభిషేక్ వ్యాఖ్యానించాడు. కుమారుడి ప్రేమ వ్యవహారం తనకు తెలుసని..ముందు చదువుమీద ధ్యాస పెట్టమని చెప్పానని అభిషేక్ తండ్రి బైజు విలేకరులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు.