విశాఖలో మహిళను వేధించిన సీఐ 

  • Published By: chvmurthy ,Published On : April 29, 2019 / 04:13 PM IST
విశాఖలో మహిళను వేధించిన సీఐ 

Updated On : April 29, 2019 / 4:13 PM IST

విశాఖపట్నం: ఒక కేసు విషయమై వివరాలు తెలుసుకోటానికి ఫోన్ చేసిన మహిళను ట్రాప్ చేయబోయి అడ్డంగా బుక్కయ్యాడు విశాఖ పట్నంలోని ఎంవీపీ జోన్ సీఐ సన్యాసి నాయుడు.  సన్యాసి నాయుడు ఫోన్ లో మాట్లాడిన మాటల రికార్డింగ్ ను బాధిత మహిళ  సోమవారం పత్రికల వారికి విడుదల చేసింది, మహిళా సంఘాలతో కలిసి ఎంవీపీ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళితే..

పల్లా మీనాక్షీ అనే యువతి రెండు నెలల క్రితం తన అక్కను ప్రేమ పేరుతో  మోసం చెసిన వ్యక్తిపై ఎంవీపీ జోన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెసింది. ఆ కేసు డీటెయిల్స్ కనుక్కొవడానికి ఎంవీపీ జోన్ సీఐ సన్యాసినాయుడుతో ఫోన్ లో మాట్లాడేదీ. దీన్ని అదనుగా తీసుకున్న సన్యాసినాయుడు మీ అక్కగురించి తరువాత, నీ గురించి కూడా కాస్తా అలోచించూ…నువ్వు ఖాళీగా ఉంటావా, ఉంటే కలుద్దాం…  అని చెప్పడం లాంటివి చెశారు. ఈ మేరకు తనతో సీఐ సన్యాసినాయుడు మాట్లాడిన వాయిస్ రికార్డులను మీనాక్షి సోమవారం విడుదల చెసింది. మహిళ చేతన సంస్థతో కలిసి ఎంవీపీ జోన్ పోలీసు స్టేషన్ ముందు అంధోళనకు దిగింది మీనాక్షి. అయితే సదరు సీఐ సన్యాసి నాయుడు మాత్రం వేదింపులు ఏం చెయ్యలేదని అంటున్నాడు.