సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో కలకలం : గన్ తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో కలకలం చెలరేగింది. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తుపాకీతో కాల్చుకున్నాడు. గాయపడిన కానిస్టేబుల్ ను సహచరులు వెంటనే హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ చనిపోయాడు. కానిస్టేబుల్ ని వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ఉన్నతాధికారుల వేధింపులే సూసైడ్ కి కారణం అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. కానిస్టేబుల్ తీరుతో పోలీసు ఉన్నతాధికారులు షాక్ తిన్నారు. దీనిపై విచారణకు ఆదేశించారు. అసలేం జరిగిందో వెంటనే వివరణ ఇవ్వాలని చెప్పారు.
కానిస్టేబుల్ ఆత్మహత్యపై సిద్ధిపేట సీపీ జోయల్ డేవిస్ స్పందించారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మద్యం మత్తులో ఉన్నాడని, ఆ మత్తులోనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. వెంకటేశ్వర్లు కొంతకాలంగా విధులకు సరిగా హాజరుకావడం లేదన్నారు. భార్య వేడుకోవంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నామని వివరించారు. వెంకటేశ్వర్లు నల్లగొండ జిల్లా వలిగొండ మండలం చాడ వాసి అని సీపీ తెలిపారు. మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.