బాలీవుడ్ నటుడు ఖాదర్ ఖాన్ మృతి..

  • Published By: veegamteam ,Published On : January 1, 2019 / 06:41 AM IST
బాలీవుడ్ నటుడు ఖాదర్ ఖాన్ మృతి..

ముంబై : గత కొంత కాలంలో అనారోగ్యంతో బాధ్యపడుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు ఖాదర్ ఖాన్ తన 81 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ప్రస్తుతం కెనాడాలో నివాసహంటున్న ఖాదర్ ఖాన్ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 31..సాయంత్రం 6 గంటలకు మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు కూడా అక్కడే చేయనున్నట్టులుగా ఖాదర్ ఖాన్ కుమారుడు సర్ఫరాజ్ ఖాన్ తెలిపారు. అఫ్గానిస్థాన్‌లో జన్మించిన ఖాదర్‌ 1973లో వచ్చిన ‘ధాగ్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు. 250 చిత్రాలకు డైలాగులు రాశారు. ఖాదర్‌ మరణవార్త తెలిసి బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.