ఎగ్జిబిషన్ లో ప్రమాదం : అగర్ బత్తి స్టాల్ లో మంటలా? సిలిండర్ పేలుడా?
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్టాల్స్‌కు మంటలు వ్యాపించాయి. 400 స్టాల్స్ కాలిబూడిదయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. 20 ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
నుమాయిష్ జరుగుతుండటంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ సందర్శకులతో కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు ఎగ్జిబిషన్‌కు తరలివచ్చారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పెద్ద సంఖ్యలో స్టాల్స్ కొలువుదీరాయి. జనవరి 30వ తేదీ బుధవారం రాత్రి అనూహ్య రీతిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జనం ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. చాలామందికి గాయాలయ్యాయి. ఇంకా అనేకమంది స్టాల్స్‌లో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు కేర్, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఆంధ్రా బ్యాంకు ఏర్పాటు చేసిన స్టాల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం అందుతోంది. అగర్ బత్తి స్టాల్ లో మంటలు ప్రారంభమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని మరికొందరు చెబుతున్నారు.