Gun Misfire : ట్రెజరీ ఆఫీసులో గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ పరిస్థితి విషమం

కృష్ణాజిల్లా మచిలీపట్టణంలోని కలెక్టరేట్‌లో   విధుల్లో ఉన్న ఓ పోలీసు వద్ద ఉన్నగన్ మిస్ ఫైర్ అయ్యింది.

Gun Misfire : ట్రెజరీ ఆఫీసులో గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ పరిస్థితి విషమం

Gun misfire Krishna Collectorate

Updated On : December 5, 2021 / 5:08 PM IST

Gun Misfire :  కృష్ణాజిల్లా మచిలీపట్టణంలోని కలెక్టరేట్‌లో   విధుల్లో ఉన్న ఓ పోలీసు వద్ద ఉన్నగన్ మిస్ ఫైర్ అయ్యింది. బుల్లెట్ అతని గుండెల్లోకి దిగటంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో ఉన్న ట్రెజరీ‌లో గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం అతని చేతిలో ఉన్న  గన్ మిస్ ఫైర్  అయ్యింది. ఒక బుల్లెట్ అతని గుండెల్లోకి దూసుకువెళ్లింది.  తీవ్ర గాయాల పాలైన శ్రీనివాసరావును సహచర ఉద్యోగులు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Also Read : Sirpurkar Commission : సిర్పూర్కర్ కమీషన్ సభ్యులకు నిరసన సెగ
అనంతరం మరింత మెరుగైన చికిత్స కొసం అతడ్ని తాడేపల్లి లోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉన్నట్లు  తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సిధ్ధార్ధ కౌశల్ ఆగ్రహం వెలిబుచ్చారు.  ఘటన ఎలా  జరిగిందో విచారణ జరిపి నివేదిక ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు.

 

జి