Sirpurkar Commission : సిర్పూర్కర్ కమీషన్ సభ్యులకు నిరసన సెగ

సిర్పూర్కర్ కమిటీ గోబ్యాక్ అని స్థానికులు నినాదాలు చేశారు. పోలీసు స్టేషన్‌కు చేరుకున్న ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.

Sirpurkar Commission : సిర్పూర్కర్ కమీషన్ సభ్యులకు నిరసన సెగ

New Project (7)

Sirpurkar Commission :  రంగారెడ్డిజిల్లా షాద్‌నగర్‌లో దిశ నిందితులు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సిర్పూర్కర్ కమీషన్ సభ్యులు ఈరోజు క్షేత్రస్ధాయి పరిశీలనకు వెళ్లారు. అనంతరం షాద్‌నగర్ పోలీసు‌స్టేషన్‌కు వెళ్లి విచారణ రికార్డులను పరిశీలించారు. ఈసమయంలో షాద్‌నగర్‌కు చెందిన స్ధానికులు, పలు ప్రజా సంఘాల నాయకులు పోలీసు స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు.

Also Read : Omicron Corona Virus : తెలంగాణలో ఒమిక్రాన్ వార్తలపై హెల్త్ డైరెక్టర్ కీలక ప్రకటన

సిర్పూర్కర్ కమిటీ గోబ్యాక్ అని స్థానికులు నినాదాలు చేశారు. పోలీసు స్టేషన్‌కు చేరుకున్న ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. మా వాదనలు వినాలని… మా స్టేట్‌మెంట్ రికార్డు చేసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. షాద్‌నగర్ పోలీసు‌స్టేషన్‌లో విచారణ రికార్డులను కమీషన్ సభ్యులు పరిశీలించారు. అనంతరం హైదరాబాద్ బయలు దేరి వెళ్లారు. ఈ సమయంలో కమీషన్ సభ్యులకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రజా సంఘాల నాయకులు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.