ఆడపిల్లని పారేశారు : మురికి కాలువలో శిశువు.. రక్షించిన పోలీసులు

ఇదేనా సమాజం. ఆడ పిల్ల అంటే ఎందుకు అంత వివక్ష. ఆడ పిల్ల అక్కర్లేదని ఆ తల్లి శిశువును మురికి కాలువలో విసిరేసి పోయింది.

  • Published By: sreehari ,Published On : August 26, 2019 / 01:00 PM IST
ఆడపిల్లని పారేశారు : మురికి కాలువలో శిశువు.. రక్షించిన పోలీసులు

Updated On : August 26, 2019 / 1:00 PM IST

ఇదేనా సమాజం. ఆడ పిల్ల అంటే ఎందుకు అంత వివక్ష. ఆడ పిల్ల అక్కర్లేదని ఆ తల్లి శిశువును మురికి కాలువలో విసిరేసి పోయింది.

ఇదేనా సమాజం. ఆడ పిల్ల అంటే ఎందుకు అంత వివక్ష. ఆడ పిల్ల అక్కర్లేదని ఆ తల్లి శిశువును మురికి కాలువలో విసిరేసి పోయింది. ముక్కు పచ్చలారని ఆ పసికందు ఏ పాపం చేసిందని ఇలా పారేశారో తెలియదు గానీ, తల్లి ఒడిలో పాలు తాగి నిద్రిపోవాల్సిన ఆడ శిశువు మురికి కాలువలో కనిపించింది.

అదృష్టవశాత్తూ వీధి కుక్కలకు కంట పడలేదు. లేదంటే.. ఆ పసిపాప ప్రాణం పోయేది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని డ్రైనేజీలో ఉన్న శిశువును బయటకు తీశారు. పాప ఇంకా బతికే ఉందని యూపీ పోలీసులు తెలిపారు. డ్రైనేజీలో పడేయడంతో శిశువు శరీరమంతా మొత్తం బురద అంటుకుంది.

శరీరంపై కొన్నిచోట్ల బురద ఎండిపోయినట్టుగా ఉంది. హృదయవిచారకరమైన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బ్యూడాన్‌లో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను పోలీసులు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. శిశువును జిల్లా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఎమర్జెన్సీ కేర్ లో చికిత్స అందిస్తున్నారు. ఇంటెన్సీవ్ కేర్‌ యూనిట్ శిశువు నెమ్మదిగా కోలుకోవడం మరో ఫొటోలో చూడవచ్చు.

శిశువును డ్రైనేజీలో పడేసిన గుర్తు తెలియనివారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో లింగ నిష్పత్తి పరిశీలిస్తే.. 100 మంది పురుషులకు ఒక మహిళ ఉండగా.. 2014-16 నుంచి 898 నుంచి 2015-17 నాటికి 896కు లింగ నిష్పత్తి పడిపోయినట్టు ప్రభుత్వం డేటా సూచిస్తోంది.