Couple Missing : ప్రేమ పెళ్లి -పెద్దల జోక్యం- విడిపోయి మిస్సింగ్

కొన్నేళ్ళుగా ప్రేమించుకున్న ఓ ప్రేమ జంట పెద్దలనెదరించి  ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు.  ఏమైందో ఏమో   పెద్దల పంచాయతీ వచ్చే సరికి అమ్మాయి భర్త నుంచి వెళ్ళిపోయి  తల్లి తండ్రుల వద్ద

Couple Missing : ప్రేమ పెళ్లి -పెద్దల జోక్యం- విడిపోయి మిస్సింగ్

Couple Missing After Separation

Updated On : November 6, 2021 / 1:41 PM IST

Couple Missing :  కొన్నేళ్ళుగా ప్రేమించుకున్న ఓ ప్రేమ జంట పెద్దలనెదరించి  ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు.  ఏమైందో ఏమో   పెద్దల పంచాయతీ వచ్చే సరికి అమ్మాయి భర్త నుంచి వెళ్ళిపోయి  తల్లి తండ్రుల వద్దకు చేరింది.  కొద్దిరోజుల్లో అక్కడి నుంచి ఆదృశ్యమయ్యింది. అదే సమయంలో అబ్బాయి కూడా ఆదృశ్యమయ్యాడు. ఇద్దరూ ఏమయ్యారోనని ఇరువైపులా తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో   నివసించే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పెంటయ్య   కుమారుడు టోనిరాజ్(23) అక్టోబర్ 27న  తాను ప్రేమించిన   స్వప్న అనే యువతిని ఆర్యసమాజ్‌లో    పెళ్లి చేసుకున్నాడు. ఇది తెలిసిన ఇరువైపు పెద్దలు   పెళ్లి విషయమై పంచాయతీకి   కూర్చున్నారు. ఆసమయంలో   యువతి తాను తన తల్లి తండ్రుల   వద్దకే   వెళతానని  చెప్పింది.

Also Read : Puneeth Rajkumar : పునీత్ మరణాన్ని బిజినెస్ చేసుకుంటున్న హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్.. ఆగ్రహంలో ఫ్యాన్స్

సరే అని పెద్దలు అంగీకరించగా అమ్మాయి ఆమె తల్లి తండ్రులతో,  అబ్బాయి వారి తల్లితండ్రులతో   వెళ్లిపోయి  విడిగా  జీవించసాగారు. ఇదిలా ఉండగా ఈనెల 3న వతేదీన గజ్వేల్ లో   నివసించే స్వప్న  తండ్రి  పెంటయ్యకు ఫోన్ చేశాడు.   తన కుమార్తె కనిపించటంలేదని….  మీ అబ్బాయి వద్దకు ఏమైనా వచ్చిందా…. అని అడిగాడు. అనుమానం వచ్చిన పెంటయ్య తన కుమారుడు టోనీ రాజ్ కు ఫోన్ చేయగా అతడి ఫోన్ స్విఛ్చాఫ్ వచ్చింది.

దీంతో పెంటయ్య తన కుమారుడు కనిపించటం లేదని బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కనపడకుండా పోయిన టోనీరాజ్, స్వప్న ల ఆచూకి లభించక ఇరు కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి.