‘అన్నను పాతిపెట్టిన చోటే నన్ను కూడా పూడ్చేయండి’

‘అన్నను పాతిపెట్టిన చోటే నన్ను కూడా పూడ్చేయండి’

Updated On : August 18, 2020 / 3:30 PM IST

సోదరుడు చనిపోయాడనే బాధలో ఓ 17ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. అతణ్ని పాతిపెట్టిన చోటే నన్ను కూడా పూడ్చాలంటూ సూసైడ్ నోట్ లో రాసి చివరి కోరికను తీర్చమని వేడుకుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ జిల్లా రామోల్ గ్రామంలో యువతి తన పెదనాన్న కొడుకు చనిపోవడంతో మనస్తాపానికి గురైంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన బాధిత యువతి కుటుంబం రామోల్ రవినగర్ లో వలస వచ్చి బతుకుతున్నారు.



సోదరుడి భార్య యాక్సిడెంట్ లో చనిపోవడంతో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. శనివారం ఉదయం టిఫిన్ చేసి ఇంట్లో వాళ్లంతా బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం లంచ్ సమయానికి వేరే గదిలో ఉన్న యువతి చున్నీకి వేలాడుతూ.. విగతజీవిగా కనిపించింది. షాక్ కు గురైన కుటుంబీకులు మృతదేహం నుంచి సూసైడ్ లెటర్ ను సేకరించారు.



బాధిత యువతి కజిన్ సోదరుడికి చాలా క్లోజ్ అని అతని చావు ఆమెను డిప్రెషన్ లోకి వెళ్లిపోయేలా చేసిందని స్థానికులు అంటున్నారు. ఆ లెటర్ లో అన్న చనిపోయాక తనకు బతకాలని లేదని రాసింది. దాంతోపాటుగా అన్నను ఎక్కడేతే పాతిపెట్టారో అక్కడే పూడ్చాలని రాసింది. పంచనామా పూర్తి చేసి మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించారు.