ప్లాస్టిక్ బ్యాగ్ లో మృతదేహం : గొంతు నులిమి బాలుడి హత్య
మహారాష్ట్రలోని రాయ్ గడ్ జిల్లాలో ప్లాస్టిక్ బ్యాగ్ లో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. బాలుడిని గొంతు నులిమి, తలను గాయపరిచి చంపినట్లు డీసీపీ అశోక్ దూదే వెల్లడించారు.

మహారాష్ట్రలోని రాయ్ గడ్ జిల్లాలో ప్లాస్టిక్ బ్యాగ్ లో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. బాలుడిని గొంతు నులిమి, తలను గాయపరిచి చంపినట్లు డీసీపీ అశోక్ దూదే వెల్లడించారు.
మహారాష్ట్రలోని రాయ్ గడ్ జిల్లాలో ప్లాస్టిక్ బ్యాగ్ లో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. రాయ్ గడ్ జిల్లాలోని పన్వెల్ లో రోడ్డుపై ప్లాస్టిక్ బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించింది. స్థానికుల సమాచారంతో నవీ ముంబై పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు బ్యాగ్ ను తెరిచిచూడగా అందులో ఏడేళ్ల వయసున్న బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.
పన్వెల్ సిటీకి చెందిన తల్లిదండ్రులు తన బాలుడిని గుర్తించారు. చనిపోయిన బాలుడి పేరు సూరజ్ మోను ఉపేంద్ర సాహిగా గుర్తించామని డీసీపీ అశోక్ దూదే తెలిపారు. బాలుడిని గొంతు నులిమి, తలను గాయపరిచి చంపినట్లు వెల్లడించారు. ఐపీసీ సెక్షన్ 302, 201 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.