Cheating Gang Arrested : అశ్లీల వీడియోలు చూశావు…. ఫైన్ కట్టమంటూ బెదిరింపు
ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగి, తక్కువ ధరకే డేటా లభించటంతో చాలామంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అందులో ఎక్కువ మంది చాటుమాటుగా పోర్న్ చూస్తారని చాలామందికి తెలుసు. కానీ ఎవరు ఎవరితోనూ పైకి చెప్పుకోరు తమ సన్నిహితులతో తప్ప.

Tv Watching On Mobile Phone
Cheating Gang Arrested : ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగి, తక్కువ ధరకే డేటా లభించటంతో చాలామంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అందులో ఎక్కువ మంది చాటుమాటుగా పోర్న్ చూస్తారని చాలామందికి తెలుసు. కానీ ఎవరు ఎవరితోనూ పైకి చెప్పుకోరు తమ సన్నిహితులతో తప్ప. అలాంటి వారిని గుర్తించి వారిని బెదిరించి వారివద్దనుంచి 30లక్షలకు పైగా వసూలు చేసిన ముఠాను ఢీల్లీ సైబర్ క్రైం పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు.
వీరిని పట్టుకునేందుకు ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులు తమళనాడులో ఒకవారంపాటు తిష్టవేసి చెన్నై, త్రిచి, కోయంబత్తూరు, ఊటీలమధ్య 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి చివరికి ముగ్గరు నిందితులు గ్రాబ్రియేల్ జేమ్స్, రామ్ కుమార్ సెల్వం, బి.ధీనుశాంత్ లను పట్టుకోగలిగారు. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి బి. చందర్ కాంత్ మాత్రం కంబోడియాలో ఉంటాడని తెలుసుకున్నారు. అతని ఆదేశాల మేరకే ఈ దందా నడిపినట్లు తెలిపారు. చందర్ కాంత్, ఇప్పుడు పట్టుబడిన ధీనుశాంత్ సోదరుడు కావటం గమనార్హం.
ఇంటర్నెట్ లో అశ్లీల వీడియోలు చూస్తున్నారు…. జరిమానా కట్టండి అంటూ తమకు నోటీసులు వచ్చాయని ఇటీవల పలువురు బాధితులు సోషల్ మీడియాలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. పోలీసు డిపార్ట్ మెంట్ నుంచి వచ్చిన బోగస్ పాప్ అప్ నోటీసులను కూడా వాటితోపాటు షేర్ చేశారు. వీటిని చూసిన ఢిల్లీలోని క్రైం బ్రాంచ్ పోలీసులు ఈకేసును సుమోటోగా తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బాధితులకు వచ్చిన బోగస్ పాప్ అప్ నోటీసులను టెక్నికల్ టీం పరిశీలించి ఇవన్నీ చెన్నై నుంచి వచ్చాయని గుర్తించింది.
దాంతో ఒకటీం వారంరోజులపాటు చెన్నైలో మకాం వేసింది. వలపన్ని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది. ఇంటర్నెట్ వినియోగదారులకు బోగస్ నోటీసులు పంపించటం వంటి మొత్తం ఆపరేషన్‌కు సంబంధించిన సాంకేతిక భాగాన్ని బి. చందర్‌కాంత్ నిర్వహిస్తున్నారని అతని సోదరుడు ధీనుశాంత్ పోలీసు విచారణలో తెలిపాడు. అతడు కంబోడియా రాజధాని నమ్ పెన్ సమీపంలో ఉన్న వీల్ పోన్ నుంచి వీటన్నింటిని ఆపరేట్ చేసేవాడని తెలిపాడు. “ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో, మోసం చేసిన డబ్బును తరలించడానికి 20 కి పైగా బ్యాంకు ఖాతాలు నిందితులు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితులు ముగ్గురు ఈఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు గుర్తించబడిన యూపీఐ ఐడీలు, బోగస్ నోటీసులలో ఉపయోగించిన క్యూఆర్ కోడ్ ల ద్వారా రూ. 30 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసు దర్యాప్తు లో తేలింది. ఇలా వచ్చిన డబ్బును సోదరుడు చందర్‌కాంత్ క్రిప్టో కరెన్సీల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తరలిస్తున్నట్లు ధీనుశాంత్ వెల్లడించాడు. డబ్బును దాచడానికి నిందితులు మరికొన్ని ఖాతాలను ఉపయోగించినట్లు గుర్తించిన పోలీసులు ఆ విషయమై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు.