ఉన్నావ్ కేసు : డిసెంబర్ 16న తీర్పు

ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఉన్నావ్ అత్యాచార ఘటనపై ఢిల్లీ కోర్టు డిసెంబర్ 16 న తీర్పు చెప్పనుంది. యూపీకి చెందిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కులదీప్ సెంగార్ ఈ కేసులో అత్యాచార నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కోంటున్నాడు. కేసు విచార చేసిన సీబీఐ డిసెంబర్ 9, సోమవారం నాడు తన వాదనలు వినిపించింది.
డిసెంబర్ 2న కెమెరా విచారణలో సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్ధానానికి సమర్పించింది. దీంతో ఢిల్లీ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. డిసెంబర్ 16న తీర్పు చెప్పనున్నట్లు న్యాయమూర్తి ధర్మేష్ శర్మ వెల్లడించారు. కాగా..నిర్భయ అత్యాచార ఘటన జరిగి ఆరోజుకు 7 సంవత్సరాలు పూర్తవుతుంది.
యూపీలోని ఉన్నావ్ లో ఓ మైనర్ బాలిక 2017 లో తనపై మాజీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో ఉండగానే బాధితురాలి తండ్రి ఓ కేసు విషయంలో జైలులోనే మరణించాడు. మరోవైపు రోడ్డు ప్రమాదంలో ఆమె బంధువులను సైతం కోల్పోగా, ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటినుంచి ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతోంది.