Delhi Girl Murder : భార్య బంధువుల ఇంటికి-ప్రియురాలు పడక గదికి-హత్య చేసిన ప్రియుడు

బంధువులు ఇంటికి  వెళ్లిన భార్య ఇంటికి తిరిగి వచ్చేలోపు ఆమె ఇంట్లో ఒక యువతి అర్ధ నగ్నంగా హత్యగావించబడిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ హత్యకు ఆ ఇంటి యజమానే కారణం అని పోలీసులు భావిస్

Delhi Girl Murder : భార్య బంధువుల ఇంటికి-ప్రియురాలు పడక గదికి-హత్య చేసిన ప్రియుడు

Delhi girl murder

Updated On : February 19, 2022 / 4:47 PM IST

Delhi Girl Murder :  బంధువులు ఇంటికి  వెళ్లిన భార్య ఇంటికి తిరిగి వచ్చేలోపు ఆమె ఇంట్లో ఒక యువతి అర్ధ నగ్నంగా హత్యగావించబడిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ హత్యకు ఆ ఇంటి యజమానే కారణం అని పోలీసులు భావిస్తున్నారు.

ఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని కౌశిక్ ఎన్‌క్లేవ్‌లో అమన్, భార్య ప్రియాంక రావత్‌తో కలిసి  కాపురం ఉంటున్నాడు. శుక్రవారం ప్రియాంక ఆమె బంధువులు ఇంటికి వెళ్లింది. తిరిగి రాత్రి 8 గంటల సమయంలో ఆమె ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంట్లో మంచం మీద ఒక యువతి అర్ధనగ్న స్ధితిలో… గొంతుకోసి హత్యచేయబడి ఉంది.

వెంటనే ఆమె బురారీ పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు  దర్యాప్తు ప్రారంభించారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తులో భాగంగా మృతురాలు నాథుపురా ప్రాంతానికి చెందిన యువతిగా గుర్తించి ఆమె తండ్రికి సమాచారం అందించారు.చాలా కాలంగా బాధితురాలికి, అమన్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రియాంక రావత్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఆమె భర్త అమన్ పరారీలో ఉన్నాడు.

భార్య బంధువులు ఇంటికి వెళ్లగానే అమన్ తన ప్రియురాలిని ఇంటికి పిలిపించుకున్నట్లు…అనంతరం వారిద్దరి మధ్య ఘర్షణ జరిగి హత్య జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. అమన్ పట్టుబడితేనే ఆరోజు ఇంట్లో ఏం జరిగింది…ఏ పరిస్ధితుల్లో హత్య జరిగి ఉంటుందనేది తేలదు. అమన్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.