20 కత్తిపోట్లు తగిలినా దొంగలను ఎదిరించిన టెక్కీ

యాక్షన్ సినిమాని తలదన్నేలా ఉన్న దారి దోపిడీ ఘటన కర్ణాటకలో జరిగింది. 20 కత్తిపోట్లు తగిలినా, నొప్పిని భరిస్తూ , దొంగలను ఎదిరించి వారినుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు.
బెంగుళూరు కు చెందిన టెక్కీ నరేష్ తన భార్య మనీషా తో కలిసి జులై 6, సోమవారం తెల్లవారుఝూమున కారులో చిక్ మంగుళూరు వెళుతున్నాడు. ప్రయాణంలో హెబ్బల్ ఫ్లై ఓవర్ దాటుతుండగా ఇద్దరు దొంగలు , మరో ఇద్దరు వ్యక్తులను కొట్టి వారి వద్ద నుంచి విలువైన వస్తువులను దోచుకోవటం చూశారు.
వారికి సహాయ పడేందుకు టెక్కీ దంపతులు కారు హారన్ సౌండ్ చేస్తూ ముందుకు వెళ్లారు. కారులో దంపతులు రావటం గమనించిన దుండగులు రోడ్డు మీద వారిని వదిలేసి తమ మోటారు సైకిళ్లను వీరి కారుకు అడ్డంగా తీసుకు వచ్చి ఆపారు.
వారిలో ఒకడు కత్తితో కారు వద్దకు వచ్చి డోర్ తీయ బోయాడు. అప్పటికే కారు డోర్ లాక్ వేసి ఉండటంతో డోర్ లు రాలేదు. దొంగల్లో ఒకడు డోర్ అద్దాలు పగల గొట్టి నరేష్ పై కత్తితో దాడి చేశాడు. అయినా నరేష్ కారు దిగలేదు. దీంతో దుండగుడు నరేష్ ను పిడి గుద్దులతో కొట్టనారంభించాడు. ఈ దాడిలో నరేష్ ముఖం, చేతిపై, మెడపై పై గాయాలయ్యాయి.
నరేష్ దొంగ తో పోరాడు తుంటే అంతకు ముందు దొంగలు దోచుకోబోయిన ఇద్దరు వ్యక్తులు నిస్సహయంగా చూస్తూ నిల్చున్నారు. నరేష్ దొంగలతో పోరాడుతున్న సమయంలో అతని భార్య డ్రైవింగ్ సీటులో కూర్చుని కారును ముందుకు పోనివ్వటానికి ప్రయత్నించింది. ఆ క్రమంలో వీరి కారు దొంగల మోటారు సైకిల్ ను ఢీ కొట్టి ముందుకు వెళ్లింది. దీంతో మోటారు సైకిల్ పై కూర్చున్న మరోక దొంగ కిందపడ్డాడు.
వెంటనే రెండో దొంగ కూడా నరేష్ ను వదిలి ..ఇద్దరూ కలిసి పారిపోయారు. అంతకు ముందు దోచుకోటానికి ప్రయత్నించిన బాధితులు ఇద్దరు నరేష్ వద్దకు వచ్చారు. దొంగలు తన భర్త మెడలో బంగారు గొలుసు తెంచుకుని పోతారనుకున్నాను కానీ వారు నా భర్త పై దాడి చేశారని.. దీంతో తాను డ్రైవింగ్ అందుకుని కారును ముందుకు పోనిచ్చానని అతని భార్య మనీషా తెలిపింది.
నరేష్ వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్ళి చికిత్స చేయించుకున్నాడు. జరిగిన దారి దోపిడీ గురించి కోడిగేహళ్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.