Dog Incident: కుక్క నోటికి రక్తం, శరీర భాగాలు కూడా..! యజమాని ప్రాణం తీసిన పెంపుడు కుక్క..! హైదరాబాద్‌లో దారుణం
ఈ విషయం తెలిసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కుక్కలను పెంచుకునే వారు వాటి పట్ల..

Dog Incident: హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ పెంపుడు కుక్క తన యజమాని ప్రాణం తీసింది. మధురానగర్ లో ఈ ఘోరం జరిగింది. పవన్ కుమార్ అనే వ్యక్తిని అతడి పెంపుడు కుక్క కరిచి చంపేసింది. అంతేకాదు పవన్ కుమార్ శరీర భాగాలను కూడా తినేసింది. ఈ మేరకు పవన్ స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను పవన్ ఇంటికి వెళ్లి తలుపు తట్టానని, అయినా పవన్ డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి డోర్ పగలగొట్టి చూడగా.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి బిత్తరపోయానని పవన్ స్నేహితుడు తెలిపాడు.
పవన్ కుమార్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. పవన్ పెంపుడు కుక్క నోటికి పూర్తిగా రక్తం కనిపించింది. వెంటనే అతడు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు. పవన్ మర్మాంగాలపై కుక్క దాడి చేయడం వల్లే అతడు చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.
Also Read: రేషన్ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ తప్పు చేస్తే కార్డు వెంటనే క్యాన్సిల్..
యజమాని శునకం చంపిన చనిపోయిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ విషయం తెలిసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కుక్కలను పెంచుకునే వారు వాటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెంపుడు కుక్కే అయినా దాంతో జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అంటున్నారు.