Master kidnaped student : విద్యార్ధినిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్న డ్రిల్ మాస్టార్

Master kidnaped student : విద్యార్ధినిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్న డ్రిల్ మాస్టార్

Drill Master kidnaped student

Updated On : April 14, 2021 / 4:24 PM IST

kidnaped a student for marriage : మాస్టార్ అనే పదం వింటేనే ప్రతి ఒక్కరికి చాలా గౌరవ భావం కలుగుతుంది. పిల్లలకు విద్యా బుధ్దులు నేర్పించి వారిని ప్రయోజకులను చేసేది వారే కనుక. స్కూల్లో ఉపాధ్యాయుడు పిల్లల్ని సమాజంలో ఎదగటానికి పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతారు. కొందరు మాస్టార్ల బుద్ది వక్రమార్గం పట్టి ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నారు. తమిళనాడులోని ఒక డ్రిల్ మాస్టార్ మ ప్లస్ టూ చదివే విద్యార్ధినిని పెళ్లి చేసుకునేందుకు కిడ్నాప్ చేశాడు. చివరికి పోలీసులుకు చిక్కి జైలు పాలయ్యాడు.

కృష్ణగిరి జిల్లా మత్తూరు సమీపంలోని జింజెమ్ పట్టికి చెందిన మూర్తి కుమార్తె (16) ప్లస్ టూ చదవుతోంది. తిరుమణ్ణామలై జిల్లా మేల్ సంగంలో ఉంటూ… కూలి పనులు చేసుకుంటూ అదే ప్రాంతంలో ఉన్న డేనియల్ మిషన్ మెట్రిక్యులేషన్ స్కూల్లో చదువుకుంటోంది.

ఈనేపధ్యంలో ఏప్రిల్ 9 వ తేదీనుంచి బాలిక కనిపించకుండా పోయింది. తల్లి తండ్రులు కావ్య,మూర్తిలు వెంటనే మత్తూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికను నాగనూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పీటీ మాస్టార్ చరణ్ రాజ్ ఇంట్లో ఉన్నట్లు తెలుసు కున్నారు.

చరణ్ రాజ్ ఇంటిపై దాడి చేసి బాలికను రక్షించి తల్లి తండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా చరణ్ రాజ్ పలు ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించాడు. వయసు పైబడుతున్నా తనకి ఇంకా వివాహం కాలేదని…. అందుకే బాలికను కిడ్నాప్ చేసి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్లు అతను చెప్పాడు. అతడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను తల్లితండ్రులకు అప్పగించారు. కేసు తదుపరి విచారణ జరుగుతోంది.