Drunk Model create Ruckus : తాగిన మైకంలో ఆర్మీ వాహనంపై దాడి చేసిన మోడల్

మద్యం మత్తులో ఓ మోడల్ ఆర్మీ వాహనంపై దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో స్థానిక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Drunk Model create Ruckus : తాగిన మైకంలో ఆర్మీ వాహనంపై దాడి చేసిన మోడల్

Gwalior Drunken Model

Updated On : September 10, 2021 / 6:39 PM IST

Drunk Model Create Ruckus : మద్యం మత్తులో ఓ మోడల్ ఆర్మీ  వాహనంపై దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో స్థానిక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

గ్వాలియర్‌లోని పడవ్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఢిల్లీకి   చెందిన ఓ మోడల్(22) రోడ్డుపై హంగామా సృష్టించింది, మద్యం మత్తులో ఉన్న ఆ యువతి రోడ్డుపై  వెళ్లే వాహనాలను అడ్డుకుంది. ఆ సమయంలో అటుగా వచ్చిన ఆర్మీ వాహానానికి అడ్డంగా నిలబడి హంగామా సృష్టించింది.
హైహీల్స్ చెప్పులు వేసుకుని.. కురచ దుస్తులు ధరించిన ఆ యువతి రోడ్డుపై ఆర్నీ వాహనాన్ని ఆపేసింది. అడ్డు తొలగమని కోరిన ఆర్మీ ఉద్యోగిని  సైతం పక్కకు నెట్టివేసింది. తన కాలితో వాహానం హెడ్ లైట్ ను గట్టిగా తన్నింది. దీంతో వాహానం హెడ్ లైట్ ధ్వంసం అయ్యింది.  యువతి చేసిన హంగామాకి ఆ రోడ్డులో కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

సమాచారం తెలుసుకున్న పడవా పోలీసు స్టేషన్ సిబ్బంది మహిళా పోలీసుతో వచ్చి ఆమెను పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఆమెపై కేసు నమోదు చేసి, వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మరో ఇద్దరు మోడల్స్ పోలీసు స్టేషన్ కు చేరుకుని యువతిని విడిచిపెట్టాల్సిందిగా పోలీసులను కోరారు.

తాము ముగ్గురం ఒక కార్యక్రమంలో పాల్గోనేందుకు ఢిల్లీ నుంచి గ్వాలియర్ వచ్చామని వివరించారు. పోలీసులు వైద్య పరీక్షల అనంతరం ఆ యువతిని  స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. కాగా ఈ ఘటననై ఆర్మీ అధికారుల నుంచి ఎటువంటి  ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.