Noida: సెక్యూరిటీ గార్డుపై మహిళ వీరంగం.. కాలర్ పట్టుకుని దుర్భషలాడుతూ..

Noida: సెక్యూరిటీ గార్డుపై మహిళ వీరంగం.. కాలర్ పట్టుకుని దుర్భషలాడుతూ..

Drunk Woman Assaults Security Guard, Holds His Collar in Noida Before Throwing His Cap in Air

Updated On : October 8, 2022 / 9:13 PM IST

Noida: కొద్ది రోజుల క్రితం గ్రేటర్ నోయిడాలో ఒక మహిళ సెక్యూరిటీ గార్డు పట్ల అమర్యాదపూర్వకంగా ప్రవర్తించిన ఘటన చర్చనీయాంశమైంది. సెక్యూరిటీ గార్డును దుర్భషలాడుతూ ఆమె చేసిన వీరంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ ఘటన అనంతరం వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. అదే నోయిడాలోని గ్రేటర్ సొసైటీకి చెందిన ఒక మహిళ.. సెక్యూరిటీ గార్డుతో అభ్యంతరకరంగా ప్రవర్తించింది. అతడి టోపీ లాగి, కాలర్ పట్టుకుని దుర్భషలాడింది. తాజాగా ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట్ల వైరల్ అవుతోంది. సదరు మహిళ మత్తులో ఉంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాలోని అజ్నార్ సొసైటీలో పని చేస్తోన్న ఒక గార్డు పట్ల అదే సొసైటీలో ఉంటున్న ఒక మహిళ అమానుషంగా ప్రవర్తించింది. గార్డు టోపీ లాగి, కాలర్ పట్టుకుని దుర్భషలాడింది. ఆమె ఇంత వీరంగం చేస్తున్నా ఆ గార్డు మాత్రం ఏమీ అనకుండా నిలబడి ఉన్నాడు. ఇంతలో సదరు మహిళను ఒక వ్యక్తి వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆమె వినకుండా గార్డు పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించింది. అనంతరం పోలీసులు బాధితుడైన సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.