హత్యా ? ఆత్మహత్యా ? : EXPRESS TV యజమాని మృతి 

  • Published By: madhu ,Published On : February 1, 2019 / 02:28 AM IST
హత్యా ? ఆత్మహత్యా ? : EXPRESS TV యజమాని మృతి 

Updated On : February 1, 2019 / 2:28 AM IST

కృష్ణా : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ ఎండీ చిగురుపాటి జయరామ్ అనుమానాస్పదంగా మ‌ృతి చెందారు. ఎవరైనా హత్య చేశారా ? లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నందిగామ మండలం ఐతవరం సమీపంలో జాతీయ రహదారిపై కారులో ఈయన డెడ్ బాడీ లభ్యమైంది. కారులో ఇతను ఒక్కడే ఉన్నాడా ? లేక ఇంకెవరైనా ఉన్నారా అనేది తెలియరావడం లేదు. 

ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం రోడ్డు పక్కనే ఉన్న గోతిలో కారు (ఏపీ 16ఈ జీ 0620) ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కారులో చూడగా మృతదేహం ఉంది. డెడ్బాడీ పడిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. కారు వెనుకభాగంలో సీటు కింద మృతదేహం ఉంది. పోలీసుల దర్యాప్తులో ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ యజమానిగా గుర్తించారు. ఇతని తలపై రక్తపు మరకలున్నాయి. అంతేగాకుండా కారులో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. హత్య..ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చిగురుపాటి జయరామ్ విజయవాడ కోస్టల్ బ్యాంకు ప్రమోటర్‌గా కూడా ఉన్నారు.