బాకీ తీర్చటానికి కూతుర్ని రూ.2లక్షలకు అమ్మేసిన తండ్రి

బాకీ తీర్చటానికి కూతుర్ని రూ.2లక్షలకు అమ్మేసిన తండ్రి

Updated On : February 19, 2021 / 4:51 PM IST

failing to pay debt, meerut truck driver sells his daughter for Rs.2 Lakhs : ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో దారుణం జరిగింది, తీసుకున్న అప్పుతీర్చలేకపోయినందుకు ఒక తండ్రి తన కుమార్తెను రుణదాతకు రూ, 2లక్షల రూపాయలకు విక్రయించాడు. అతడు పెట్టే లైంగిక వేధింపులు భరించలేని యువతి అక్కడ్నించి పారిపోయి పోలీసులను ఆశ్రయించింది.

మీరట్ జిల్లా పార్తాపూర్ లోని శతాబ్ధినగర్ కు చెందిన ట్రక్కు డ్రైవర్ బరాట్ జిల్లాలో నివసిస్తున్న ఒక వ్యక్తి వద్ద రూ.2లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పుకు సకాలంలో వడ్డీలు, అసలు చెల్లించలేక పోవటంతో రుణదాత అతడిపై డబ్బుచెల్లించమని ఒత్తిడి చేశాడు. దీంతో అతడు డబ్బు చెల్లించలేక తన కుమార్తెను అతడికి 2లక్షల రూపాయలకు అమ్మేశాడు. ఇదంతా ఏడాది క్రితం జరిగింది.

ట్రక్కు డ్రైవర్ కూతుర్నిస్వాధీనం చేసుకున్న రుణదాత ఆ యువతిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏడాది పాటు అక్కడ నరకం అనుభవించిన బాధితురాలు ఒకరోజు అక్కడ్నించి తప్పించుకుని పారిపోయి తన తల్లి వద్దకు చేరింది, ఇద్దరూ కలిసి మీరట్ క్రైం ఎస్పీ ని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు.

కూతుర్ని ఎందుకు అమ్మావని అడిగినందుకు ట్రక్కు డ్రైవర్ తన భార్యపై ఇనుముతోకాల్చి వాతలు పెట్టినట్లు తెలిపింది. ఫిర్యాదు స్వీకరించి ఎస్పీరామరాజ్ కేసు దర్యాప్తు చేయాల్సిందిగా స్ధానిక సీఐ బ్రహ్మపురిని ని ఆదేశించారు.  నిందితుడైన  ట్రక్ డ్రైవర్ కు గతంలో నేర చరిత్ర ఉన్నదని కొన్నాళ్లు తీహార్, దాస్నా జైలులో గడిపినట్లు పోలీసులు తెలిపారు.