Honour Killing : మైసూరులో పరువు హత్య

ఇతర కులస్తుడిని,మతస్తుడిని ప్రేమించిన పాపానికి చిన్నారుల జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. ఏభాష అయినా, రాష్ట్రమైనా పరువు హత్యలు ఆగటం లేదు.

Honour Killing : మైసూరులో పరువు హత్య

Karnataka Honour Killing

Updated On : June 8, 2022 / 2:52 PM IST

Honour Killing :  ఇతర కులస్తుడిని,మతస్తుడిని ప్రేమించిన పాపానికి చిన్నారుల జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. ఏభాష అయినా, రాష్ట్రమైనా పరువు హత్యలు ఆగటం లేదు. కర్ణాటక లోని మైసూరు జిల్లా పరిధిలోని పెరియపట్నం తాలూకా  కగ్గుండి గ్రామానికి చెందిన సురేష్, బేబీ దంపతుల కుమార్తె షాలిని (17) పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతోంది. షాలిని పొరుగున ఉండే మేళ్లహళ్లి గ్రామానికి చెందిన మంజు అనే దళిత యువకుడితో ప్రేమలో పడింది.

ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియటంతో వారు కుమార్తెను కట్టడి చేశారు. దీంతో ఒకరోజు మంజు, షాలిని ఇంట్లోంచి పారిపోయారు. షాలిని తల్లి తండ్రులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసలు  ప్రేమికులిద్దరినీ వెతికి తీసుకువచ్చారు.  ఈక్రమంలో షాలిని పోలీసు స్టేషన్‌లో  కూడా తల్లి తండ్రులకు వ్యతిరేకంగా…  తాను మంజు  మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని తాను అతనితోనే ఉంటానని తేల్చి చెప్పింది.

మైనర్ బాలిక కావటంతో పోలీసులు బాలికను బాలసదన్ కు అప్పచెప్పారు. బాలసదన్ లో ఉన్న షాలిని తల్లి తండ్రులకు ఫోన్ చేసి తనను ఇంటికి తీసుకువెళ్ళమని కోరింది. దీంతో సురేష్ దంపతులు బాలసదన్ కు వచ్చి తమ కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లారు. ఇంటికి వచ్చిన కొద్దిరోజులకు షాలిని మళ్లీ తాను మంజు ను ప్రేమిస్తున్నానని.. అతనితో ఇచ్చి తన వివాహం జరిపించమని మళ్లీ తల్లి తండ్రులను కోరింది.

దీంతో ఆగ్రహానికి గురైన సురేష్ సోమవారం తెల్లవారుఝూమున కూతురు షాలిని గొంతుకోసి హత్య చేసి మంజు నివసిస్తున్న మేళహళ్లి గ్రామంలోని వ్యవసాయ భూమిలో పడేసి వచ్చాడు, మంగళవారం ఉదయం పెరియపట్నం పోలీసు స్టేషన్ కు వెళ్లి తన కుమార్తెను హత్య చేసినట్లు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేళహళ్లి గ్రామానికి వెళ్లి  షాలిని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.