జూబ్లీహిల్స్‌లో ఫెరారీ కారు బీభత్సం

  • Published By: sreehari ,Published On : October 11, 2020 / 04:35 PM IST
జూబ్లీహిల్స్‌లో ఫెరారీ కారు బీభత్సం

Updated On : October 11, 2020 / 4:43 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఫెరారీ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్‌తో దూసుకెళ్తూ అదుపు తప్పిన ఫెరారీ కారు పాదాచారులను ఢీకొట్టింది. కారు ఢీకొని ఏసుబాబు అనే వ్యక్తి మృతిచెందాడు.



ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరొకరిని ఆస్పత్రికి తరలించారు. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.



కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.