Fire Accident : కాజా టోల్‌గేట్ లో అగ్నిప్రమాదం

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్‌గేట్ లో ఈ రోజు సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Fire Accident : కాజా టోల్‌గేట్ లో అగ్నిప్రమాదం

Fire Accident

Updated On : June 10, 2021 / 7:31 PM IST

Fire Accident : గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్‌గేట్ లో ఈ రోజు సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది.  ఈ ప్రమాదంలో విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న లారీ పూర్తిగా దగ్దం అయింది.
లారీ తమిళనాడుకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.

టోల్ ప్లాజా వద్ద  టోల్ ఫీ చెల్లింపు చేస్తున్న సమయంలో లారీ టైర్ ఒక్కసారిగా పేలటంతో  మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఆయిల్ ట్యాంక్ కు వ్యాపించడంతో మరింత వేగంగా మంటలు వ్యాపించాయి. ఈఘటనతో లారీకి కుడి, ఎడమ వైపుల ఉన్న రెండు టోల్ ఫీ తీసుకునే బాక్స్ లు మంటలకు ఆహుతయ్యాయి.

లాక్ డౌన్ అమలులో ఉండటంతో   పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెపుతున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని లారీలో ఎలాంటి లోడు లేదని మంటలను అదుపులోకి తీసుకు వచ్చామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణం లారీ టైరు పేలటమే అని ప్రాధమికంగా అంచనా వేశారు. దీనిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.