తప్పిన ఘోర ప్రమాదం : ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు

రాజమండ్రి: యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంగళవారం(మార్చి-5-2019) తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌

  • Published By: veegamteam ,Published On : March 5, 2019 / 01:54 AM IST
తప్పిన ఘోర ప్రమాదం : ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు

Updated On : March 5, 2019 / 1:54 AM IST

రాజమండ్రి: యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంగళవారం(మార్చి-5-2019) తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌

రాజమండ్రి: యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంగళవారం(మార్చి-5-2019) తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌ దగ్గర ఈ  ఘటన చోటుచేసుకుంది. ప్యాంట్రీ కార్(వంట చేసే) బోగీలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

అగ్నిప్రమాదంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు. అనంతరం అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. 2 ఫైరింజన్లను అక్కడికి పంపించారు. ఫైరింజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రయాణికులు రిలాక్స్ అయ్యారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సకాలంలో  ప్రయాణికులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు. రైలు ప్రమాదం కారణంగా ప్రస్తుతం ఒకే లైన్‌ ద్వారా రైళ్ల రాకపోకలు కొనసాగిస్తున్నారు.
Also Read : రైలు ప్రమాదం : తాగునీటి కోసం ప్రయాణికుల ఇబ్బందులు

తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో రైల్లోని ప్యాంట్రీకారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రైలులో మొత్తం 23 బోగీలు ఉండగా 9వ బోగీ అయిన పాంట్రీకార్ మంటలు చెలరేగాయి. వీటిని గుర్తించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలు ఆపేశారు. ఆపై రైల్వే సిబ్బంది కూడా బోగీలను వేరుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. మంటల్లో బోగీ పూర్తిగా కాలిపోయింది. బోగీలో మంటలు చూసి అసలేం జరుగుతుందో తెలియక ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగిన బోగీని.. ఇతర బోగీలతో వేరు చేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.
Also Read : గురి చూసి కొట్టారు : పాక్ డ్రోన్‌ను కూల్చేసిన భారత్