ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం : 32 మంది మృతి

  • Published By: chvmurthy ,Published On : December 8, 2019 / 03:43 AM IST
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం : 32 మంది మృతి

Updated On : December 8, 2019 / 3:43 AM IST

ఢిల్లీలో ఆదివారం తెల్లవారు ఝూమున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  రాణి ఝాన్సీ రోడ్డులోని  అనాజ్ మండిలోని ఒక ఇంటిలో మంటలు చెలరేగటంతో ప్రజలు భయ బ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది 30 ఫైరింజన్లతో మంటలను ఆర్పటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో 32 మంది మరణించినట్లు గుర్తించామని, 50 మందిని సురక్షితంగా కాపాడగలిగామని మరో 22 మందిని ఆస్పత్రిలో చేర్పించినట్లు డిప్యూటీ చీఫ్ ఫైర్ అధికారి సునీల్ చౌదరి చెప్పారు.  ఎంతమేర ఆస్తి నష్టం సంభవించింది, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.