ఏకంగా కోర్టునే మోసం చేశారు : విశాఖలో ఫోర్జరీ గ్యాంగ్‌ గుట్టురట్టు

విశాఖలో ఫోర్జరీగ్యాంగ్‌ గుట్టురట్టైంది. బెయిల్‌ కోసం నకిలీ ష్యూరిటీ పత్రాలు తయారు చేస్తూ దొరికిపోయింది.

  • Published By: veegamteam ,Published On : October 30, 2019 / 07:34 AM IST
ఏకంగా కోర్టునే మోసం చేశారు : విశాఖలో ఫోర్జరీ గ్యాంగ్‌ గుట్టురట్టు

Updated On : October 30, 2019 / 7:34 AM IST

విశాఖలో ఫోర్జరీగ్యాంగ్‌ గుట్టురట్టైంది. బెయిల్‌ కోసం నకిలీ ష్యూరిటీ పత్రాలు తయారు చేస్తూ దొరికిపోయింది.

విశాఖలో ఫోర్జరీగ్యాంగ్‌ గుట్టురట్టైంది. ఏకంగా జిల్లా కోర్టునే మోసం చేస్తోందీ 13సభ్యుల ముఠా. బెయిల్‌ కోసం నకిలీ ష్యూరిటీ పత్రాలు తయారు చేస్తూ దొరికిపోయింది. నకిలీ స్టాంపులు, ఆధార్‌కార్డులు, ఇంటిపన్ను రసీదులు, జామీనుపత్రాలు తయారు చేస్తుండగా పట్టుకున్నారు. నకిలీ జామీనుదారులను కోర్టులో ప్రవేశపెట్టి వారిని అసలైన వారిగా నమ్మించి కోర్టునే మోసం చేస్తోందీ ముఠా. 

డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ నిందితులకు నకిలీ ఆధార్ కార్డులతో ఘరానా ముఠా బెయిల్ ఇప్పిస్తోంది. 2006 నుంచి ఈ తతంగం జరుగుతోంది. ఇప్పటివరకు కూడా చాలామంది నిందితులు తప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ముఠాతోపాటు న్యాయవాదుల హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. న్యాయవాదులతోపాటు 13 మంది ఒక ముఠాగా ఏర్పడి డబ్బుల కోసమే ఇవ్వన్నీ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఒక వ్యవస్థపై నమ్మకం లేకుండా చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

తదుపరి విచారణలో న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. వీరిలో ఏ1 కోటేశ్వర్ రావు, రౌడీ షీటర్ సత్యనారాయణ కీలక నిందితులుగా ఉన్నారు. వీరి దగ్గర ఇతర రాష్ట్రాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన స్టాంప్, ప్యాడ్స్ అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు.