శృంగార నటి సోదరుడిపై హత్యాయత్నం

  • Published By: murthy ,Published On : May 30, 2020 / 12:03 PM IST
శృంగార నటి సోదరుడిపై హత్యాయత్నం

Updated On : May 30, 2020 / 12:03 PM IST

తమిళ సినీ పరిశ్రమకు చెందిన శృంగార నటి మాయ కొడుకుపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతడి పేరు విక్కీ, అలియాస్ విఘ్నేష్ కుమార్. చెన్నై విరుగంబాక్కంలో ఉంటున్నాడు. గురువారం(మే 28,2020) రాత్రి ఎనిమిది మంది వ్యక్తులు విక్కీ ఇంట్లోకి చొరబడ్డారు. కత్తులతో దాడి చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. 

ఈ దాడిలో విక్కీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానిక వడపళనిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. దాడిలో విక్కీకి ఆరు చోట్ల గాయాలయ్యాయి. 40 కుట్లు వేశామని డాక్టర్లు తెలిపారు. 

రంగంలోకి దిగిన విరుగంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే విక్కీ మద్యం సేవిస్తూ తరచూ స్థానికులతో గొడవ పడుతుంటాడని, అతని బాధితులు పాత కక్ష్యల కారణంగా దాడి చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

జులాయి, తాగుబోతు, తిరుగుబోతు:
విక్కీ, నటి కృష్ణ కుమారికి మనవడు అవుతాడు. ప్రస్తుతం ఆమె దగ్గరే ఉంటున్నాడు. విక్కీ ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరుగుతుంటాడని స్థానికులు తెలిపారు. విక్కీపై పలు పోలీసు కేసులు ఉన్నాయి. ఓ మహిళను లైంగికంగా వేధించాడు. మద్యం మత్తులో పోలీసుపై దాడి చేసినట్టు కేసు నమోదైంది.

కాగా, విక్కీ తల్లి నటి మాయ ఐటెమ్ సాంగ్స్ స్పెషలిస్ట్. మాయకు కూతురు ఉంది. ఆమె పేరు బాబిలోనా. ఆమె కూడా శృంగార నటిగా గుర్తింపు పొందారు. తల్లి లాగే బాబిలోనా కూడా ఐటెమ్ సాంగ్స్ స్పెషలిస్ట్.

babilona 1

అందాల ఆరబోతతో తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో సెక్సీ నటిగా పేరు తెచ్చుకున్న బాబిలోనా ఎన్నో సినిమాల్లో నటించారు.

babilona hot stills

 

తెలుగు కుటుంబానికి చెందిన ఆమె అసలు పేరు భాగ్యలక్ష్మి. పారిశ్రామికవేత్త సుందర్ బాబుల్ రాజును ప్రేమించిన ఆమె 2015లో క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. బాబిలోనా బీ గ్రేడ్ సినిమాలతో పాపులర్ అయింది.

babilona 3

బాబిలోనా ‘పిరందాచ్చు’ అనే చిత్రంతో కోలీవుడ్ లో ఆరంగ్రేటం చేసింది. ఆపై ఐటెం సాంగులు, చిన్న హీరోల సినిమాల్లో వ్యాంప్ తరహా పాత్రలతో బాగానే గుర్తింపు పొందింది.

Read: అర్జున్ రెడ్డి ఇన్స్పిరేషన్ తో అమ్మాయిలకు వల