హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్: పాతబస్తీలో ఉద్రిక్తం

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్, నాలుగేళ్లుగా జరుగుతున్న అత్యాచారం

  • Published By: chvmurthy ,Published On : January 13, 2019 / 12:33 PM IST
హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్: పాతబస్తీలో ఉద్రిక్తం

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్, నాలుగేళ్లుగా జరుగుతున్న అత్యాచారం

హైదరాబాద్: నగరంలోని కామాటిపుర పోలీసుస్టేషన్ పరిధిలో మైనర్  బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆలశ్యంగా వెలుగు చూసిన ఈఘటనలో బాలిక తల్లితండ్రులు పోలీసు కంప్లయింట్ ఇచ్చినా ప్రధాన నిందితుడిని 4వ ముద్దాయిగా  చేర్చటాన్ని నిరసిస్తూ దాదాపు 200 మంది స్దానికులు పోలీసు స్టేషన్ ఎదుట ఆదివారం నిరసన తెలిపారు
వివరాల్లోకి వెళితే … గొల్లాడికి చెందిన 16 ఏళ్ల బాలికపై  11 మంది  యువకులుసామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అత్యాచారం చేసే సమయంలో  వీడియోలు తీసి బాధితురాలిని బెదిరించి నరకం చూపించారు. ఈవిషయాన్ని బయటపెడితే  సోషల్ మీడియాలోవీడియోలు వైరల్ చేస్తామని బెదిరించటంతో బాలిక ఆ బాధలను కొంతకాలం భరించింది.వీరి చేష్టలకు విసిగిపోయిన బాలిక 2018  డిసెంబర్ లో విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. డిసెంబర్ 24 న కుటుంబ సభ్యలు కామాటిపుర పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు పంపారు. బాలికపై గత నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు రిపోర్టు వచ్చింది.
కంప్లయింట్ ఇచ్చి 2వారాలు గడిచినా పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేయకుండా,  నిందితులకు సహకరిస్తున్నారని ,వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆదివారం పీఎస్ ఎదుట ధర్నాకు దిగటంతో ఉద్రిక్త పరిస్ధితి ఏర్పడింది.