Woman Gang Rape : భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద మహిళపై గ్యాంగ్ రేప్.. ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు అరెస్టు
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను అరెస్టు చేశారు.

Woman Gang Rape
Woman Gang Rape : భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను అరెస్టు చేశారు.
బీఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ను శుక్రవారం రాత్రి పశ్చిమ బెంగాల్ పోలీసులకు అప్పగించారు. ఇద్దరిని నిందితులుగా చేర్చి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఆగస్టు 26వ తేదీన బాగ్దా బోర్డర్ ఔట్‌పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పార్గనాస్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Woman Gang Rape : రేపల్లే రైల్వే స్టేషన్ లో మహిళపై గ్యాంగ్ రేప్..భర్తను బెదిరించి అఘాయిత్యం
బంగ్లాదేశ్ నుంచి చొరబడేందుకు ప్రయత్నించిన మహిళను దగ్గరలో ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అయితే విధుల్లో ఉన్న ఏఎస్ఐ ఆ కానిస్టేబుల్‌కు హెల్ప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఘటన వెలుగులోకి వచ్చింది.