Gas Cylinder Blast : నానక్రామ్గూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు-11 మందికి గాయాలు
హైదరాబాద్ నానాక్రామ్గూడలో ఈ రోజు ఉదయం వంటగ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి.

Gas Cylinder Blast At Nanak Ram Guda
Gas Cylinder Blast : హైదరాబాద్ నానాక్రామ్గూడలో ఈ రోజు తెల్లవారు ఝూమున వంటగ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసం అయ్యింది.
సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను స్ధానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక గ్యాస్ సిలిండర్ కు మూడు కనెక్షన్స్ ఇవ్వటం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన భవనంలో సుమారు 50 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఉత్తరాది నుంచి వచ్చి హైదరాబాద్ లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం.
Also Read : Massage Centres Seized : మసాజ్ సెంటర్లలో వ్యభిచారం…8 మంది యువతులకు విముక్తి
వాడుతున్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కు సురక్షితమైన పైపు కాకుండా సాధారణమైన పైపు అమర్చినట్లు గుర్తించారు. టీ-జాయింట్ కనెక్టర్ వాడి రెండు పొయ్యిలను వాడుతున్నారు. ఆ గ్యాస్ పొయ్యిలకు నాబ్స్ కూడా లేనట్టు గుర్తించారు. ప్రమాదం జరిగిన రూమ్ లో రెండు సిలిండర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి బ్లాస్ట్ అయినట్లు తెలిసింది.పేలుడుఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.