భర్త గుడ్లు తేవడం లేదని ప్రియుడితో జంప్
కాంపీర్‌గంజ్‌లో ఉంటున్న మహిళ నాలుగు నెలల క్రితం లవర్ తో కలిసి వెళ్లిపోయి తిరిగొచ్చింది. పోలీసుల వద్దకు వెళ్లి తనకు ప్రతిరోజూ తినడానికి కోడిగుడ్లు తీసుకురావడం లేదని..

కాంపీర్‌గంజ్‌లో ఉంటున్న మహిళ నాలుగు నెలల క్రితం లవర్ తో కలిసి వెళ్లిపోయి తిరిగొచ్చింది. పోలీసుల వద్దకు వెళ్లి తనకు ప్రతిరోజూ తినడానికి కోడిగుడ్లు తీసుకురావడం లేదని..
పట్టు చీర తేలోదనో.. నెక్లెస్ కొనలేదనో కాదు. కోడి గుడ్లు తీసుకురావడం లేదనే కారణంతో నాలుగేళ్ల వివాహ బంధాన్ని పక్కకు పెట్టి ప్రియుడితో వెళ్లిపోయింది ఓ మహిళ. ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంపీర్‌గంజ్‌లో ఉంటున్న మహిళ నాలుగు నెలల క్రితం లవర్ తో కలిసి వెళ్లిపోయి తిరిగొచ్చింది. పోలీసుల వద్దకు వెళ్లి తనకు ప్రతిరోజూ తినడానికి కోడిగుడ్లు తీసుకురావడం లేదని అందుకే మనస్తాపం చెంది వెళ్లిపోయానని చెప్పింది.
మళ్లీ శనివారం(అక్టోబరు 26న) కోడి గుడ్ల కోసం గొడవ అయింది. ఆ తర్వాత మళ్లీ ఇంట్లో నుంచి పారిపోయింది. అదే సమయంలో మహిళ లవర్ కూడా కనిపించకుండాపోయాడు. స్థానికులు వారిద్దరూ కలిసే వెళ్లిపోయి ఉంటారని అనుకుంటున్నారు.
ఆమె భర్త ఓ దినసరి కూలీ. రోజూ కోడి గుడ్లు తీసుకొచ్చే స్తోమత అతనికి లేదు. అతని బలహీనతను అవకాశంగా చేసుకున్న మహిళ రోజూ గుడ్లు తేవడం లేదనే కారణంతో గొడవ పెట్టుకునేది. ‘ఆమెకు గుడ్లంటే పిచ్చి. తన లవర్ దగ్గర్నుంచి రోజూ కోడి గుడ్లు తీసుకొచ్చుకునేది’ అని మహిళ భర్త చెప్పి వాపోయాడు.