Grand Mother Killed : అమ్మమ్మ అమానుషం.. రెండో పెళ్లి కోసం మనవడిని చంపేసింది
సంగారెడ్డిలో అమానుష ఘటన జరిగింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన మనవడిని సొంత అమ్మమ్మే కిరాతకంగా చంపేసింది.

Grand Mother Killed
Grand Mother Killed : సంగారెడ్డిలో అమానుష ఘటన జరిగింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన మనవడిని సొంత అమ్మమ్మే కిరాతకంగా చంపేసింది. కూతురికి మరో పెళ్లి చేసేందుకు మనవడు అడ్డుగా ఉన్నాడని ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది.
రెండేళ్ల బాలుడి అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. సొంత అమ్మమ్మే చిన్నారిని అమానుషంగా హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. సంగారెడ్డికి చెందిన యశ్వంత్(2) గురువారం కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లేకపోయింది. అయితే శుక్రవారం అనూహ్యంగా బిబ్బిలకుంట చెరువులో యశ్వంత శవమై తేలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన స్టైల్ లో విచారణ చేశారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
చిన్నారి యశ్వంత్ తండ్రి రెండేళ్ల కిందట మరణించాడు. భర్త చనిపోయిన కూతురికి మరో పెళ్లి చేయాలని ఆమె తల్లి భావించింది. అయితే మనవడు ఆమెకు అడ్డుగా కనిపించాడు. అంతే, మరో ఆలోచన చేయకుండా ఏ మాత్రం కనికరం చూపకుండా మనవడిని కిరాతకంగా చంపేసి చెరువులో పడేసింది. మరొకరి సాయంతో మనవడిని అమ్మమ్మే మట్టుబెట్టింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తన కూతురు భవిష్యత్తు కోసమే తానిలా చేశానని నిందితురాలు చెప్పింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. స్థానికులు కన్నీటిపర్యంతం అయ్యారు.