ఆడపిల్ల పుట్టిందని విషం ఇచ్చి చంపిన నాయనమ్మ

అర్థ శతాబ్ధపు అజ్ఞానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కానీ, ఇంకా కూడా ఆ ఛాయలు కొన్ని చోట్ల పోలేదు అంటే ఎంత అమానుషం కదా? ఆడపిల్ల పుడితే మహాలక్ష్మీ పుట్టిందని సంబరపడాల్సింది పోయి, ఆడపిల్ల భారం అని భావించి హత్యలు చేస్తున్నారు.. చెత్తబుట్టల్లో పడేస్తున్నారు.. ముళ్లపొదళ్లో విసిరేస్తున్నారు. మనలోనే ఇటువంంటి రాతి మనుషులు ఉన్నారు.
పుడితే కొడుకే పుట్టాలి అనుకుని అరచాకాలకు తెగబడే వ్యక్తులు ఉన్నారు. లేటెస్ట్‌గా ఇటువంటి ఘటనే తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పోచంపల్లి సమీపంలోని బారూర్ నాగర్‌కోట్టై ప్రాంతంలో చోటుచేసుకుంది. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టగా.. రెండోసారీ కూడా ఆడపిల్ల పుట్టిందని చిన్నారికి విషం ఇచ్చి చంపింది నాయనమ్మ. అయితే టీకాలు వేసే నర్సు ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కోట్టై ప్రాంతంలో నివసించే ఓసిరాజా(26), సత్య(23) దంపతులకు శ్రీమతి(3) అనే కుమార్తె ఉంది. ఈ ఏడాది మేలో సత్య మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేని ఓసిరాజా తల్లి పొట్టియమ్మాల్(48) రెండోసారీ ఆడపిల్ల పుట్టిందని కోపంతో విషం పెట్టి చంపేసింది. టీకాలు వేసే నర్సు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. విషయం వెలుగులోకి వచ్చింది.
ఆడశిశులను రక్షించేందుకు భేటీ బచావో..భేటీ పడావో వంటి పథకాలు అమలు చేసినా ఇటువంటి సంఘటనలు వెలుగుచూస్తున్నాయి.