మంచానికి కట్టేసి మరదలిపై అత్యాచారం

16ఏళ్ల అబ్బాయి.. తన మరదలిపై అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 15ఏళ్ల బాలికను మంచానికి చేతులు, కాళ్లు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుర్గావ్ లోని సెక్టార్ 51 ప్రాంతంలో జరిగింది.
బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడుపై మహిళా పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. తమ వదిన కుమారుడే తన కుమార్తెపై అత్యాచారం చేసినట్టు ఆమె ఫిర్యాదు చేసినట్టు గుర్గావ్ పోలీసు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, సుభాష్ బోకన్ చెప్పారు.
తన వదిన అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇంట్లో పనుల్లో సాయం చేసేందుకు తన కుమార్తెను పంపినట్టు ఆమె చెప్పింది. హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లిన ఆమె ఇంట్లో తన కుమారుడి దగ్గర మేనకోడలిని ఉంచి వెళ్లింది.
ఇదే అదునుగా భావించిన అతడు.. తన సోదరి కోసం వెతికినట్టు నటిస్తూ తన మరదలిని లాక్కెళ్లి మంచానికి చేతులు, కాళ్లను కట్టేసి అత్యాచారం చేసినట్టు బాధితురాలి తల్లి ఫిర్యాదులో తెలిపింది.