హైదరాబాద్ అబిడ్స్ లో భారీ అగ్నిప్రమాదం

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 07:09 AM IST
హైదరాబాద్ అబిడ్స్ లో భారీ అగ్నిప్రమాదం

Updated On : April 17, 2019 / 7:09 AM IST

హైదరాబాద్ అబిడ్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ సర్కిల్ లోని జీపీఓ దగ్గర ఎంజే మార్కెట్‌ సమీపంలోని హిందీనగర్‌లో ఓ ఫర్నిచర్‌ గోదాములో మంటలు ఎగిసిపడ్డాయి. ఫోర్ వీలర్ దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అబిడ్స్, బేగంపేట పోసులు సంయుక్తంగా రెస్క్యూ  ఆపరేషన్ చేపట్టారు. మరిన్ని ఫైరింజన్లను అక్కడికి తెప్పిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. షెడ్లల నుంచి పొగలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో అక్కడ తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.