రియల్ టైమ్ నిఘా: నేరగాళ్లకూ మూడినట్టే
నగరంలో నేరగాళ్లకు హెచ్చరిక. ఇటీవల నగరంలో చైన్ స్నాచర్ల ఆగడాలు మరి ఎక్కువ అయ్యాయి. రోడ్లపై ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసుకొని వారి మెడలో నుంచి ఆభరణాలు ఎత్తుకెళ్తున్నారు. మరోవైపు కిడ్నాప్ కేసులు, ఆపై హత్యలు పెరిగిపోతున్నాయి.

నగరంలో నేరగాళ్లకు హెచ్చరిక. ఇటీవల నగరంలో చైన్ స్నాచర్ల ఆగడాలు మరి ఎక్కువ అయ్యాయి. రోడ్లపై ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసుకొని వారి మెడలో నుంచి ఆభరణాలు ఎత్తుకెళ్తున్నారు. మరోవైపు కిడ్నాప్ కేసులు, ఆపై హత్యలు పెరిగిపోతున్నాయి.
నగరంలో నేరగాళ్లకు హెచ్చరిక. ఇటీవల నగరంలో చైన్ స్నాచర్ల ఆగడాలు మరి ఎక్కువ అయ్యాయి. రోడ్లపై ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసుకొని వారి మెడలో నుంచి ఆభరణాలు ఎత్తుకెళ్తున్నారు. మరోవైపు కిడ్నాప్ కేసులు, ఆపై హత్యలు పెరిగిపోతున్నాయి. పోలీసులకు సమాచారం అందేలోపే జరగాల్సిన దారుణాలు జరిగిపోతున్నాయి. నేరాలను ముందుగానే పసిగట్టి క్రిమినల్స్ ఆట కట్టించేందుకు సిటీ పోలీసు చర్యలు చేపట్టారు. హైటెక్ క్రిమినల్స్ కు చెక్ పెట్టేందుకు రియల్ టైమ్ టెక్నాలజీని త్వరలో రానుంది. నేరానికి పాల్పడిన క్షణాల్లోనే క్రిమినల్స్ తాట తీసేందుకు హైటెక్ టెక్నాలజీని నగర పోలీసులు అందుబాటులోకి తీసుకోస్తున్నారు.
హైటెక్ కెమెరాలతో రియల్ టైమ్ క్రైమ్స్ ను వెంటనే పసిగట్టేయడం పోలీసులకు సులభతరం కానుంది. నగరవ్యాప్తంగా 350 జంక్షన్లలో ఆటోమాటిక్ నంబర్ ప్లేట్ రికిగ్ నైజేషన్ (ఏఎన్ పీఆర్) హైటెక్ కెమెరాలను అమర్చనున్నారు. ఈ కెమెరాలు క్రిమినల్స్ నేరానికి వినియోగించే వాహనాలపై నెంబర్ ప్లేట్స్ ను క్యాప్చర్ చేసి పోలీసులకు సమాచారం అందిస్తాయి. ఈ క్యాప్చర్ ఇమేజ్ ను టెక్ట్స్ ఫార్మాట్ లోకి మార్చేస్తాయి. రియల్ టైమ్ క్రైం జరిగే లోకేషన్ తో పాటు వెహికల్ నెంబర్ సమాచారాన్ని కూడా పోలీసులకు చేరవేస్తాయి.
ఈ హైటెక్ కెమెరాలన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి ఉంటాయి. ఆర్టీఏ డేటాబేస్, పోలీసు డిపార్ట్ మెంట్ సర్వర్లకు ఏఎన్ పీఆర్ కెమెరాలను ఇంటిగ్రేట్ చేస్తారు. నేరం జరిగే ప్రాంతానికి సంబంధించి అలర్ట్ వెంటనే పోలీసులకు చేరిపోతుంది. దీంతో పోలీసులు సమీప ప్రాంతంలోని పోలీసులను అప్రమత్తం చేసి నేరగాళ్లను పట్టుకునేందుకు సూచినలు చేస్తారు. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే కాకుండా వెహికల్ మోడల్, ఏ కలర్ ఉందో కూడా కెమెరాలు ట్రేస్ చేస్తాయి. దొంగలించిన వెహికల్స్ ను కూడా వెంటనే ట్రేస్ చేసేందుకు పోలీసులకు ఎంతో ఈజీ అవుతుంది.
నగరంలోని భవనాల్లో, రోడ్ల కూడళ్లలో ఇదివరకే అమర్చిన వందలాది కెమరాలతో కూడా ఈ హైటెక్ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్)తో అనుసంధానం చేయనున్నారు. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలైన సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న 350 జంక్షన్లలో కనీసం ఎనిమిది వరకు రియల్ టైమ్ కెమెరాలను అమర్చనున్నారు. ఈ ప్రాజెక్టుపై ఎల్ అండ్ టీ వర్క్ చేస్తోందని ఓ పోలీసు అధికారి తెలిపారు. అన్ని అనుకున్నట్టు జరిగితే.. ఫ్లైఓవర్లతో పాటు అన్నీ జంక్షన్ల దగ్గర ఈ హైటెక్ కెమెరాలను త్వరలో అమర్చనున్నట్టు తెలిపారు.